మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్… ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టినట్లుగా ఉంది. ప్రధానమంత్రి హోదాలో.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా… ఆయనే తీసేసుకుని… తుపాను ఫణి పై.. సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. కానీ.. ఆయా రాష్ట్రాల్లో.. కనీసం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో… కూడా కోడ్ సడలించలేదు. నేరుగా.. తుపాను.. ఒడిషాను తాకుతూండటంతో… ఆ ఒక్క రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో కోడ్ సడలింపులు ఇచ్చిన ఈసీ… తుపాను ప్రభావం ఉన్న మరో మూడు రాష్ట్రాలపై శీత కన్నేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే లేఖలు రాసినా.. కనీసం స్పందన లేదు.
కోడ్ పేరుతో.. అధికారులు ఎవరూ సీఎంల ఆదేశాలు పాటించకూడదని.. తాను నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా సందేశాన్ని పంపిన ఈసీ… ప్రధానమంత్రికి మాత్రం ప్రత్యేకాధికారాలు కల్పించింది. రాష్ట్రాల్లో తుపాను సహాయక చర్యలపై.. ఆయన కేబినెట్ సెక్రటరీ సహా.. ఉన్నతాధికారులందర్నీ పిలిపించుకుని సమీక్ష చేసినా కిమ్మనడం లేదు. అదేమీ కోడ్ కు విరుద్ధం కాదంటున్నారు. మరి ఏపీలో మాత్రం..సీఎం తుపాను పై సమీక్ష చేయడానికి అధికారం లేకుండా పోయింది. అయినా చంద్రబాబు…కోడ్ అంగీకరించినంత వరకూ…తన విధులు నిర్వర్తించడానికి..పార్టీ పరంగా ఏర్పాటు చేసుకున్న సమీక్షల్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఉదయమే సచివాలయానికి వెళ్లారు. తుపానును ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరాలు తెలుసుకున్నారు.
తుఫాన్ సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు అక్కర్లేదని .. మళ్లీ వాటికోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని…తిత్లీ తుఫాన్ సమయంలో జారీచేసిన ఆదేశాలనే ఇప్పుడు అనుసరించవచ్చని అధికారులకు సూచించారు. అవసరమైతే నేను క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వస్తానన్నారు. పసిపిల్లలకు పాలు అందుబాటులో ఉంచడం, టెట్రా పాల ప్యాకెట్లను సరఫరా చేయడం, తుఫాన్ ప్రాంతాలకు అవసరమైన మేర పశు దాణా తరలించడం, క్రేన్లు, విద్యుత్, టెలిఫోన్ సిబ్బందిని ఉంచుకోవాలని సూచనలు చేశారు. మరో వైపు.. నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు.. ఎలాంటి సాయం అయినా చేయడానికి సిద్ధమని ఆపన్న హస్తం అందించారు.