ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై..అదే పనిగా… అత్యంత కచ్చితమైన ఫలితాలు అంటూ..రిజల్ట్స్ ప్రకటిస్తున్న జ్యోతిష్యులు, సిద్ధాంతులు, పంచాగకర్తలు, వాస్తు పండితులకు… హేతువాద సంఘం .. ఓ సవాల్ విసురుతోంది. మే 23వ తేదీన వెల్లడయ్యే ఫలితాలను అత్యంత కచ్చితంగా చెప్పిన వారికి ఘనసన్మానం, రూ. ఐదు లక్షలు ఇస్తామని ప్రకటన విడుదల చేసింది. జ్యోతిష్యం చెబితే పోయేదేముంది.. వస్తే సన్మానం, ఐదు లక్షలు అనుకుంటే కష్టమే.ఎందుకంటే.. . ఈ సవాల్ ను చాలా సీరియస్‌గా ఆర్గనైజ్ చేస్తోంది జన విజ్ఞాన వేదిక. అందుకే అత్యంత కచ్చితంగా చెప్పిన వారికి సన్మానం చేస్తారు… అలాగే.. తప్పు చెప్పిన వారు.. మోసం చేసినట్లుగా భావించి చీటింగ్ కేసులు పెడతారట.
ఉగాది పండుగ రోజున.. అన్ని పార్టీల ఆఫీసుల్లో పంచాగాలు చదివారు. ఆ తర్వాత సిద్ధాంతులు, జ్యోతిష్యులు…. అన్ని పార్టీల జాతకాలు చెప్పారు. వాస్తు పండితులూ…లెక్కలు వేశారు. ఇలాంటి వాళ్లందరికీ జనవిజ్ఞాన వేదిక… ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటి వరకూ..ఎన్నికలపై.. జ్యోతిష్యాలు చెప్పిన వాళ్లంతా.. తమ ఆహ్వానాన్ని అంగీకరించి.. సవాల్‌గా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు. కాక
మ్మ కబుర్లు చెప్తూ ప్రజలను మోసం చేయకండి..దమ్ముంటే సవాల్ స్వీకరించమని పిలుపునిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 23 రోజుల సమయం ఉంది. ఎవరు గెలుస్తారో ఈవీఎంలు తెరిచే వరకూ ఎవరూ చెప్పలేరు. తమకు ఉన్న నెట్‌వర్క్‌తో ఓ అంచనాకు రావడానికి రాజకీయ పార్టీలే నానా తంటాలు పడుతున్నాయి.
ఇలాంటి సమయంలో… ఇంట్లో కూర్చుని… గళ్లు గీసి.. ఫలితాలు చెప్పేస్తున్న ప్రతిభావంతులకు.. ఇదో అద్భుత అవకాశం. తమ టాలెంట్‌ను ప్రదర్శించి… భవిష్యత్‌ను అంచనా వేస్తే…వారి భవిష్యత్ బంగారమవుతుంది. లేకపోతే చీటింగ్ కేసవుతుంది. జన విజ్ఞానవేదిక నేతలు.. జ్యోతిష్యం అబద్ధం..బూటకం… మోసం…అంటూ తేల్చేస్తున్నారు. తాము చెప్పేది అబద్దమైనతే వచ్చి నిరూపించాలంటున్నారు.
కాకమ్మ కబుర్లు చెప్పకుండా దమ్ముంటే సవాల్ స్వీకరించాలంటున్నారు. మరి ఇప్పటి వరకూ.. ఎన్నికల ఫలితాలను ప్రకటించిన జ్యోతిష్య పండితులు స్పందిస్తారా..? ఐదు లక్షలు, సన్మానాన్ని పొందుతారా..?