జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అన్న చర్చ జనసేన అభిమానులలోనే కాకుండా ఇటు సామాన్య ప్రజానీకంలో కూడా బాగా నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు బలమైన మీడియా అండ ఉండడంతో, వారు జనసేనకు రెండు నుంచి మూడు సీట్లకు మించి రావు అని పదేపదే చేస్తున్న ప్రచారం కారణంగా తటస్థ ఓటర్లలో, సామాన్య ప్రజానీకంలో కొంతమంది అదే విషయాన్ని నమ్ముతూ ఉన్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన పార్టీ ప్రభావాన్ని అంత తేలిగ్గా తీసి పారేయలేం అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జనసేన నేత మాదాసు గంగాధరం ఒక సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీకి ఐదు ఎంపీ సీట్లు ఖచ్చితంగా రానున్నాయని వ్యాఖ్యానించారు.
జేడీ లక్ష్మీ నారాయణ పోటీ చేసిన విశాఖపట్నం నియోజకవర్గం, నాగబాబు పోటీచేసిన నరసాపురం నియోజకవర్గం , అమలాపురం రాజమండ్రి, కాకినాడ నియోజకవర్గాలలో జనసేన గెలవ బోతోందని మాదాసు గంగాధరం వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో సమాచారం ఆధారంగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని, నియోజకవర్గాల్లో ఓటర్లు తాము నియోజకవర్గ అభ్యర్థి బట్టి కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని బట్టి తాము ఓటు వేశామని చెప్పారు అని మాదాసు గంగాధరం వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా, జనసేన అభిమానులకు మాదాసు గంగాధరం వ్యాఖ్యలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పాలి.