ఫొని తుపాను గమనాన్ని అంచనా వేసి.. అధికారయంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్ …వ్యవస్థ.. అందరి ప్రశంసలను పొందింది. ఒడిషా అధికారులు.. , రైల్వే శాఖ కూడా.. ఆర్టీజీఎస్ ఇచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేసింది. తుపాను ఉనికి ప్రారంభమైనప్పటి నుంచి… ఆర్టీజీఎస్ రేయింబవళ్లు శ్రమించింది. తుపాను ప్రభావితం ప్రాంతాలైనా నాలుగు జిల్లాల్లో కోడ్ మినహాయింపు రావడంతో..చంద్రబాబు శరవేగంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా తుపాన్ బాధితుల్ని ఆదుకునేందుకు… పక్కా ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం కూడా ఆర్టీజీఎస్ సాయం తీసుకుంటున్నారు. తుఫాన్ బాధితుల కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బాధితులకు తక్షణం పరిహారం అందేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.నష్టం అంచనాపై అధికారుల కోసం ఎదురు చూడకుండా.. బాధితులే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు చేసింది. ‘పీపుల్ ఫస్ట్ యాప్’కు తుఫాన్ నష్టం ఫోటోలను పంపితే చాలు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా తక్షణ మదింపు, పరిహారం చెల్లింపు చేసేలా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నేరుగా బాధితులు, రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. అనుమానాలుంటే 1100 కాల్ సెంటర్కు ఫోన్ చేయాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. ఆర్టీజీఎస్ పని తీరుపై..సర్వత్రా ప్రశంసలు రావడంతో.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం .. అందరికీ స్వీట్ బాక్సులు కూడా పంపించారట.
సహాయ పునరాాసంపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని .. 1.14 లక్షల మందికి భోజన వసతి కల్పించామన్నారు. బాధితులకు రేపటి వరకు భోజన వసతి కొనసాగుతుందన్నారు. ఆస్తినష్టం..ప్రాణనష్టం లేకుండా చూడగలిగామని…పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. ఆర్టీజీఎస్ సిబ్బంది చాలా కష్టపడ్డారని..వారు ఇచ్చిన సమాచారంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంద్నారు. ఐఎండీ ఇవ్వలేని సమాచారాన్ని ఆర్టీజీఎస్ ఇస్తోందని ప్రశంసించారు. కచ్చితమైన సమాచారాన్ని అందించారని ఒడిశా ప్రభుత్వం అభినందించిందని.. ఒడిశా సీఎంతో మాట్లాడాను..సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పానన్నారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 733 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం కనిపించిందని.. 9 మండలాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరిగాయన్నారు.58 వేల మంది మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశామని .. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 14 లక్షల మందిని అప్రమత్తం చేశామని లెక్కలు చెప్పారు.మూడు పట్టణాలపై తుఫాన్ ప్రభావం పడిందని విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. 182 సెల్ఫోన్ టవర్లను పునరుద్ధరించామన్నారు. తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా లేకపోవడంతో… రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.