వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అకస్మాత్‌గా లండన్ టూర్‌ను రద్దు చేసుకున్నారు. లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుని… కూడా.. చివరి నిమిషంలో ఆగిపోవడంతో.. వైసీపీలోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కుమార్తెను చూసేందుకు… అక్కడ దాదాపుగా రెండు వారాల పాటు గడిపేందుకు.. జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ.. ప్రయాణానికి ఎయిర్‌పోర్టుకు బయలుదేరాల్సిన రెండు, మూడు గంటల ముందే… రద్దు చేసుకున్నారు. దీంతో.. వైసీపీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను లండన్ వెళితే… విమర్శలు వస్తాయని జగన్ అనుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఫొని తుపాన్ ప్రభావం కనిపించింది. ఆ తుపాన్ తీరం దాటి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో.. జగన్మోహన్ రెడ్డి.. హైదరాబాద్‌లోని అత్యంత లగ్జరీ సినిమా ధియేటర్లయిన.. ఏఎంబీ మాల్‌లో… అవెంజర్స్ సినిమా చూశారు.
ఓ వైపు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. జగన్ నిమ్మళంగా సినిమా చూస్తున్నారని.. చంద్రబాబు కూడా సెటైర్లు వేశారు. ఇలాంటి తరుణంలో.. ఇక విదేశీ పర్యటనకు వెళ్తే.. ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న ఉద్దేశంతో.. ఆయన టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారని చెబుతున్నారు. అయితే… అత్యంత విశ్వసనీయవర్గాలు మాత్రం.. మరో కోణాన్ని వెల్లడిస్తున్నాయి. అదే.. విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు నుంచి పర్మిషన్ రాకపోవడం. అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్న జగన్మోహన్ రెడ్డి… విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే.. కచ్చితంగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలి. జగన్ పాస్ పోర్టు… కోర్టు అధీనంలో ఉంటుంది. వారు పాస్ పోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే.. ఈ అనుమతి రావడంలో.. ఆలస్యం జరిగిందని.. అందుకే బయలుదేరే ముందు.. ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట.. స్విట్జర్లాండ్ వెళ్లారన్న ప్రచారం జరిగింది కానీ.. ఆయన చండీగఢ్‌లోనే ఉన్నారంటున్నారు. ఇప్పుడు… లండన్ పర్యటన కూడా అలానే వాయిదా పడింది. కోర్టు పర్మిషన్ వచ్చిన తర్వాత ఆయన లండన్ టూర్‌కి వెళ్తారంటున్నారు.