ఎన్నికల సంఘం.. మోడీ చేతిలో పూర్తి స్థాయిలో కీలు బొమ్మగా మారిందని తేల్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏ మాత్రం వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు. నేరుగా ఈసీతో తలపడేందుకు సిద్ధమయ్యారు. తుఫాన్ ముందస్తు చర్యల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాస్తే తుఫాన్ వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇవ్వడంపైనా ఆయన ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఈసీకి, మిగిలిన పాలనకు సంబంధించిన అంశాలు సీఎంకు వివరించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అధికారులు అంతా బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేశారు. .వచ్చే వారం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తానని… ఈసీ అధికారులను రానీయకుండా ఎలా అడ్డుకుంటుందో చూస్తానని సవాల్ చేశారు. ఒకవేళ ఈసీ అడ్డుకుంటే…ఎందుకు అడ్డుకుందో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరుతానన్నారు. అమల్లో ఉన్న పనులపై.. కేబినెట్ భేటీలో సమీక్ష చేస్తానని ప్రకటించారు.
ఎన్నికల కోడ్ ను అడ్డంపెట్టుకుని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని చంద్రబాబు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ వేరు…రాష్ట్ర పాలన వేరని సీఎం తెలుసుకోరా అని ప్రశ్నించారు… కనీసం తుఫాన్ల సమయంలో కూడా సీఎస్….తన దగ్గరకు రాలేదన్నారు…అన్ని రాష్ట్రాల్లో సీఎస్ లు సీఎం లకు రిపోర్ట్ చేస్తారని…ఇక్కడ సీఎస్ మాత్రం తన వద్దకురావడం లేదన్నారు… సీఎస్ ను వివరాలతో రమ్మని మేము అడుక్కోవాలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు…ఇక్కడి అధికారులు చదువుకోలేదా…చట్టాలు తెలియదా అని ప్రశ్నించారు. సీఎం క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎన్నికల సంఘము ఎలా స్పందిస్తుంది. సీఎస్ కేబినెట్ కు బిసినెస్ రూల్స్ అనుసరించి హాజరు అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వల్ల రోజురోజుకూ ఏదొక వివాదం వస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి.. ఈసీ ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదు. అక్కడ ప్రధాని… ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏకంగా నాలుగు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించారు. అందుకే.. ఇప్పుడు.. చంద్రబాబు కేబినెట్ భేటీ నిర్వహించినా.. ఈసీ ప్రత్యేకంగా చర్యలు తీసుకునే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తోంది. ఎందకంటే.. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ.. కౌంటింగ్ మినహా మిగతాది ముగిసింది. ఈసీ నియమించిన సీఎస్.. వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణాలతో.. ఈసీ .. ఆత్మరక్షణలో పడిపోయింది. అందుకే చంద్రబాబు స్ట్రైక్ రేట్ పెంచుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది.