కాంగ్రెస్ పార్టీలో ఊండీలేనట్లు వ్వహరిస్తున్న కేవీవీ రామచంద్రరావు మళ్లీ.. వైసీపీ వాదనను.. కాంగ్రెస్ పార్టీ తరపున వినిపిస్తూ… ఓ బహిరంగ లేఖతో తాను ఉన్నానని… ఉనికి చాటుకున్నారు. చంద్రబాబు సమీక్షలు నిర్వహించేది.. బిల్లులు విడుదల చేయాడానికేనంటూ… వైసీపీ చేస్తున్న వాదనను…,. గట్టిగా..మరో సారి వివరిస్తూ.. బహిరంగ లేఖ రాశారు. లేఖలో పోలవరంతో అసలు చంద్రబాబుకు సంబంధమే లేదని చెప్పుకొచ్చారు కేవీపీ. 2014కి ముందు చంద్రబాబు అసలు పోలవరం ప్రాజెక్టుని సందర్శించారా..అనే లాజిక్ కూడా ప్రశ్నించారు. అసలు 2014కి పోలవరం ప్రాజెక్ట్ నాలుగు, ఐదు శాతం కూడా పూర్తి కాలేదు. అంతకు ముందు పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. 2014 నుంచి ఐదేళ్లలో ప్రాజెక్ట్ 70 శాతం పూర్తయింది. అయినా.. ఈ విషయాన్ని కేవీవీ జీర్ణయించుకోలేకపోతున్నట్లుగా లేఖ ఉంది.
కేవీవీ రామచంద్రరావు తాను ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నానని నిరూపించుకోవడానికి చంద్రబాబును విమర్శిస్తూ.. అప్పుడప్పుడూ లేఖలు రాస్తూంటారు. కాంగ్రెస్ పార్టీతో..టీడీపీ సన్నిహిత సంబంధాలు ఏర్పడక ముందు.. వారానికో లేఖ రాసి…వైఎస్ హయాంలో.. సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న మీడియా చానెళ్లలో బ్రేకింగులు వేయించుకునేవారు. కానీ కాంగ్రెస్ పార్టీతో.. టీడీపీకి సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత మాత్రం.. ఆయనకు పని లేకుండా పోయింది. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్కు .. సాయం చేయాలని.. మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిన తర్వాత కూడా.. కేవీపీ… లేఖలు రాశారు. ఓ సారి… నేరుగా విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలోనే ప్రెస్మీట్ పెట్టి.. పోలవరంపై.. చంద్రబాబు నిర్లక్ష్యం అంటూ ఆరోపణలు గుప్పించడంతో… ఆయనకు.. కత్తెర పడింది. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటికి ప్రత్యేక అజెండాతో పని చేస్తున్నారని గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ తరపున మీడియాతో మాట్లాడవద్దని సూటిగానే చెప్పేసింది. పార్టీ కార్యాలయాల్లో ప్రెస్మీట్లు పెట్టవద్దని కూడా హెచ్చరించింది. అప్పట్నుంచి ఎన్నికలయ్యే వరకూ.. ఆయన ఎక్కడా కనిపించలేదు.
కానీ.. గత ఎన్నికల్లో తెర వెనుక.. కీలక పాత్ర పోషించారని.. టీఆర్ఎస్, వైసీపీ సన్నిహిత సంబంధాల్లో కేవీపీ పాత్ర కీలకమేనన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆయితే.. కేవీపీ పాత్ర ఏ సందర్భంలోనూ బయటపడలేదు. ఆయన కూడా కాంగ్రెస్ తరపున పని చేయడానికి ముందుకు రాలేదు. ఎవరూ ఆహ్వానించలేదు కూడా. ఎందుకంటే.. కాంగ్రెస్లో ఉండి.. ఆయనతో అంతో.. ఇంతో సన్నిహిత సంబంధాలున్న ప్రతి ఒక్కరూ… వైసీపీలో చేరిపోయారు. టీడీపీ తరపున పోటీ చేయాల్సిన ఆయన వియ్యంకుడు రఘురామకృష్ణం రాజు కూడా… వైసీపీలో చేరిపోయారు. అయితే..ఆయన ఇప్పటికీ..తనను తాను కాంగ్రెస్ నేతగానే ప్రజెంట్ చేసుకుని… చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం.. రాజకీవర్గాలను సైతం.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.