పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడూ లేనంత వేగంగా.. పనులు పూర్తి చేసుకుంటున్నా.. ఏదో ఓ వంక పెట్టి.. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ… కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖలు రాస్తూండటంతో… జనవనరుల మంత్రి దేవినేని ఉమ ఒక్క సారిగా భగ్గుమన్నారు. ఆయనవి గుంట నక్క వేషాలని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపాలని… కోర్టుల్లో కేసులు వేసిన… కేసీఆర్కు.. కేవీపీ ఇంత వరకూ ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని… దేవినేని ఉమ లాజిక్ తీస్తున్నారు. అంతే కాదు.. దేశంలో.. ఒక్క పోలవరం ప్రాజెక్టు మాత్రమే … జాతీయ ప్రాజెక్టు కాదని.. ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటిలో ఏదైనా 70 శాతం పూర్తయిందేమో.. చూపించాలని సవాల్ చేశారు. ఆ ప్రాజెక్టులపై… ఎందుకు లేఖలు రాయరని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ప్రేమించుకోవడం వల్లే… పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు నిలిపివేసిందని.. కానీ.. రాష్ట్ర ప్రభుత్న నిధులతో.. ప్రాజెక్టు ఆగకుండా నిర్మితమవుతోందని… ఉమ చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టును… మోడీ కానీ.. కేవీవీ కానీ.. ఐదేళ్లలో ఒక్క సారి అయినా చూశారా అని.. దేవినేని ఉమ సూటిగానే ప్రెస్మీట్లో ప్రశ్నించారు. నిజానికి.. కేవీపీ.. గురి అంతా పోలవరం ప్రాజెక్టుపైనే గతంలో వైఎస్ హయాంలో.. పోలవరం ప్రాజెక్టు పనులు, కాంట్రాక్టులు అన్నీ… కేవీవీ కనుసన్నల్లోనే జరిగేవన్న ప్రచారం ఉంది. అయితే.. ప్రాజెక్టు మాత్రం ముందుకు కదల్లేదు. కొంత భాగం కాలువలు తీశారు. చివరికి.. నాలుగైదు శాతం పనులు జరగకుండానే పనులను ప్రీక్లోజ్ చేశారు. కారణం ఏమిటో తెలియదు కానీ… వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్ట్ పవర్ ప్లాంట్ దక్కలేదన్న కారణంగానే ఇలా చేశారని… దేవినేని ఉమ తరచూ ఆరోపిస్తూంటారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో.. పోలవరం ప్రాజెక్టు చకచకా మందుకు సాగింది. అయితే.. కేవీవీ మాత్రం…ఆ పోలవరం ప్రాజెక్ట్ ను అంటి పెట్టుకునే.. రాజకీయం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేవీవీ మామూలుగా అయితే.. ఇప్పుడు.. టీడీపీతో సఖ్యతగా ఉండాలి. ఆయన వైఎస్ ఆత్మ కాబట్టి… టీడీపీతో అలా ఉండలేరు. అలాంటప్పుడు పార్టీ విధానం ప్రకారం.. సైలెంట్ గా అయినా ఉండాలి. కానీ.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తున్న టీడీపీపై విమర్శలు మాత్రం చేయకూడదు. కానీ కేవీవీ పనిగట్టుకుని మరీ అవే ఆరోపణలు చేస్తున్నారు. అందుకే… బీజేపీ, వైసీపీ కోవర్టుగా.. కేవీపీ పని చేస్తున్నారని.. దేవినేని ఉమ అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ లో… ఇప్పటికి మిగిలిపోయిన కొంత మంది నేతల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది.