టీవీ9 అమ్మకం వ్యవహారం ముదిరి పాకాన పడి పోలీసు కేసులు దాకా వెళ్ళింది. టీవీ9 లో కేవలం తొమ్మిది శాతం వాటా ఉన్న రవి ప్రకాష్, మిగతా 80 శాతం వాటా ని శ్రీనిరాజు వద్ద నుండి కొనుక్కున్న కొత్త యాజమాన్యానికి వ్యతిరేకంగా గా పావులు కదపడం ఇప్పుడు మొదటికే మోసాన్ని తీసుకువచ్చింది. కొత్త యాజమాన్యం తరఫున కౌశిక రావు, రవి ప్రకాష్ టీవీ9 లో యాజమాన్యానికి తెలియకుండా చేసిన అవకతవకల మీద పోలీసులను ఆశ్రయించాడు. 420 చీటింగ్ కేసు తో సహా పలు కేసులు రవిప్రకాష్ మీద నమోదయ్యాయి. రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి రవిప్రకాష్ పరారీలో ఉన్నాడు.
అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని దాదాపు అన్ని చానల్స్ కవర్ చేస్తున్నాయి. రవి ప్రకాష్ లామినేటెడ్ సైజు ఫోటో పెట్టి, 420 అని రాసి ఆయన అవకతవకల గురించి చర్చిస్తున్నాయి. శ్రీనిరాజు అప్పట్లో రవి ప్రకాష్ కి పూర్తిగా స్వేచ్ఛనివ్వడం తో అన్ని తానై నడిపించిన రవి ప్రకాష్ అప్పట్లో తాను చేసిన అవకతవకలు బయటపడతాయనే ఉద్దేశంతోనే కొత్త యాజమాన్యానికి తగిన సమాచారం ఇవ్వకుండా, టీవీ9 మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫైళ్లను, హార్డ్ డిస్క్ లని మాయం చేశాడని, దాదాపు 110 కోట్ల రూపాయల సంబంధించిన లావాదేవీలు యాజమాన్యానికి తెలియకుండా రవిప్రకాష్ చేశాడని, మిగతా టీవీ చానల్స్ కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ కథనాలను చూస్తున్న ప్రజల నుండి రవిప్రకాష్ మీద ఎటువంటి సానుభూతి రాకపోగా, ఆయన చేసిన కార్యక్రమాలతో పోలిస్తే ఇది చిన్నదే అంటూ జనాలు అంటున్నారు. తమకు నచ్చిన వాళ్ళు ఎన్ని అవకతవకలు చేసినా వాటి గురించి చిన్న స్క్రోలింగ్ కూడా ఇవ్వకపోవడం, తమకు నచ్చని వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం తాటికాయంత అక్షరాలతో బ్యానర్ స్టోరీలు వేసి వారిని మానసికంగా వేధించడం ఇలాంటివి గతంలో రవిప్రకాష్ ఎన్నో చేశాడని, అప్పట్లో వారు అనుభవించిన బాధ ఎలా ఉంటుందో కనీసం ఇప్పుడైనా రవిప్రకాష్ కు అర్థం అవుతుందా అని అని జనాలు అంటున్నారు.
మొత్తానికి మెరుగైన సమాజం పాటుపడతానని చెప్పే ఛానల్ సీఈఓ ఫోర్జరీ కేసు, 420 కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశం అయింది.