పాపం… నిఖిల్. సినిమా రెడీ అయిపోయినా.. రకరకాల కారణాల వల్ల విడుదల చేసుకోలేకపోయాడు. పలుమార్లు ‘అర్జున్ సురవరం’ విడుదల తేదీ మార్చుకుంటూ వచ్చాడు. చివరికి మే 17కి ఫిక్స్ చేసుకున్నాడు. మే 17 రిలీజ్‌డేట్ ప్రకటించినప్పుడు కూడా చాలా అనుమానాలు చోటు చేసుకున్నాయి. ‘మహర్షి’ విడుదలైన వారం రోజులకే తన సినిమాని విడుదల చేయడం సాహసమని అన్నారు. మహర్షి జోరు చూసి ఆ సినిమాని మరోసారి వాయిదా వేస్తారేమో అని అంచనా వేశారు. మహర్షి భయం వల్లే…. మే 17న రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో నిఖిల్‌కి సోలో రిలీజ్ డేట్ దొరికినట్టైంది. ఇప్పుడు మహర్షికి వస్తున్న స్పందన చూస్తే… త్వరలోనే సగానికిపైగా ధియేటర్లు ఖాళీ అయిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది ‘అర్జున్ సురవరం’ కి ప్లస్ పాయింట్. మరి ఈ అవకాశాన్ని నిఖిల్ ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. మే 24న మాత్రం రెండు సినిమాలు రెడీ అయిపోయాయి. తేజ ‘సీత’, రాజశేఖర్ ‘కల్కి’ ఢీ కొట్టబోతున్నాయి.