‘చిత్రలహరి’తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజూకి… ‘చిత్రలహరి’ ఉపశమనం కల్పించింది. ఇప్పుడు మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. వచ్చే వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. తాత – తండ్రి – మనవడు మధ్య జరిగే కథ ఇది. ఈసారి మారుతి ఫ్యామిలీ ఎమోషన్లకు పెద్దపీట వేశాడు. రాజమండ్రి లాంటి టౌన్లో జరిగే కథ ఇది. డబ్బుకి తప్ప ప్రేమాభిమానాలకు విలువ ఇవ్వని ఓ తండ్రి కథ ఇది. తనని ఓ తనయుడు ఎలా మార్చాడన్నది ఈ సినిమా కథ. రావు రమేష్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. తాత పాత్రకు తగిన నటుడ్ని ఎంపిక చేయాల్సివుంది. కథానాయిక ఆల్మోస్ట్ ఖరారైపోయింది. రెండు మూడు రోజుల్లో కథానాయిక ఎవరన్న విషయంలో క్లారిటీ వస్తుంది. సినిమా పేరు కూడా ఫైనల్ అయ్యింది. ‘ప్రతి రోజూ పండగే’ అనే పేరు దాదాపుగా ఖాయం చేసే అవకాశాలున్నాయి.