2014కి ముందు నరేంద్రమోడీ అంటే.. దేశానికి బాహుబలి. ఆయన ఇండియాను అమెరికా చేసేస్తారని అందరూ అనుకున్నారు. బ్లాక్ మనీ దగ్గర్నుంచి నిరుద్యోగం వరకూ.. ప్రజలందరికీ ఓ సినిమా చూపించారు. ఆ సినిమా ఓట్ల రూపంలో బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆయన మాటలు.. వీదేశీ మీడియాను కూడా ఆకర్షిచింది. అప్పట్లో ఆయనను… ఓ రేంజ్లో పొగిడింది. ఇప్పుడు.. ” అంతన్నారు.. ఇంతన్నారు..” అని… ఐదేళ్ల లోటుపాట్లు వెలికి తీసి కడిగి పారేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ఐదేళ్లలో పూర్తి భిన్నత్వం చూపించింది.
2014లో బాహుబలి – ఇప్పుడు గుదిబండ..!
2014లో బీజేపీ అధికారం చేపట్టిన కొత్తలో టైమ్ మ్యాగజైన్.. మోడీ దేశానికి పట్టిన అదృష్టం అనే అర్థంలో భారీ స్టోరీ ప్రచురించింది. కవర్ పేజీపై మోడీ బొమ్మ వేసింది. ఐదేళ్ల తర్వాత అదే టైం మ్యాగజైన్.. పెదవి విరుస్తూ మరో కథనం ప్రచురించింది. ఈ సారి కూడా… ముఖచిత్రంగా మోడీ బొమ్మ ఉంది. ఐదేళ్ల కిందట… మోడీ ఏం చెప్పారు..? ఐదేళ్లలో చేశారనేదాన్ని .. టైమ్ కథనం విశ్లేషించింది. కుల, మతలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోతామని అప్పట్లో చెప్పారు . ఐదేళ్లలో ఆయన చేసింది.. ప్రజల మధ్య విభజనే. మూకదాడులు, గో రక్ష పేరుతో దాడులు పెరిగాయి. మత దాడులు జరుగుతున్నాయి. కానీ వీటిపై చర్యలే లేవు. అందుకే విభజన కారి అని టైం తేల్చింది. అల్లరిమూకలకు మోదీ స్నేహితుడిగా మారారని సర్టిఫికెట్ ఇచ్చేసింది.
ఆర్థిక, విద్య సహా ప్రతీ వ్యవస్థ పతనం ..!
ఆర్థిక సంస్కరణల విషయంలో… మోడీ ఎన్నో చెప్పారు కానీ.. చేసింది మాత్రం సున్నా. ఆర్థిక వ్యవస్థలో అద్భుతాలు చేస్తానన్న మోడీ.. నోట్ల రద్దు చేసి.. దిగజార్చారని టైమ్ తేల్చింది. ఆర్థిక నిపుణులు, మేథావులకు చోటు ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో ఆరెస్సెస్ సిద్ధాంతకర్త గురుమూర్తిని ఎంపిక చేయడాన్ని ప్రశ్నించింది. ఆయన నిర్ణయం ద్వారానే మోదీ నోట్లరద్దు చేశారని.. ఆ తప్పు ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థను వేధిస్తూనే ఉందని తెలిపింది టైమ్ కథనం. మోడీ విధానాలతో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని… లెక్కలేసింది. ఒకప్పుడు అభివృద్ధి, అందరికి సంక్షేమ పథకాలు, శాంతి పేరుతో ఓట్లు అడిగిన మోడీ.. ఇపుడు ఇండియా,పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను అడ్డుగా పెట్టుకొని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
మోడీ ఇమేజ్ పాతాళానికి పడిపోయేలా చేసిన టైమ్..!
అమెరికా తప్ప… యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏసియా, సౌత్ పసిఫిక్ దేశాల్లో టైమ్ మ్యాగజైన్లపై మోడీ కవర్ఫోటో ఉంది. అంటే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టోరీని ప్రచురించింది టైమ్ మ్యాగజైన్. 2014లో మోదీ ఏదో చేస్తారన్న ఆశతో అధికారం చేపట్టారని.. కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలయ్యారని చెప్పింది. ఇదే కాదు… ఆర్థిక సంస్కరణలతో అద్భుతాలు చేస్తానన్న మోడీ.. అలా చేయకపోగా.. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించారని చెప్పింది. మోదీ హయంలోనే విషపూరితమైన మతతత్వ వాతావరణం నెలకొని ఉందని కథనంలో పేర్కొంది. ముఖ్యంగా మోడీ ఫెయిల్యూర్స్ను కుండబద్ధలు కొట్టింది టైమ్ మ్యాగజైన్.