జాతీయ రాజకీయాల్లో స్పెక్యులేషన్‌కు చాన్స్ లేకుండా… డీఎంకే అధినేత స్టాలిన్..కేసీఆర్ కు…స్పష్టతిచ్చి పంపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కూటమిని విడిచిపెట్టేది లేదని..తేల్చేశారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి… కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు.. డీఎంకే నుంచి.. గట్టి మద్దతు లభించలేదు. చెన్నై వెళ్లి డీఎంకే చీఫ్..స్టాలిన్‌తో సమావేశమైన.. కేసీఆర్… గంట పాటు.. దేశ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ప్రస్తుత ఎన్నికల ట్రెండ్స్… ఫలితాల తర్వాత ఎలాంటి మార్పు ఉండబోతుందో.. కేసీఆర్ విశ్లేషించి… ప్రాంతీయపార్టీలన్నీ కూటమిగా మారిదే…రాష్ట్రాలకు మరింత బలం కలిగేలా… కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చునని సూచించినట్లు సమాచారం.
ఫెడరల్ ఫ్రంట్ స్ఫూర్తిని..స్టాలిన్ ప్రశంసించారు. కానీ ఇప్పటికిప్పుడు…ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సానుకూల ప్రకటన చేయలేనని..చెప్పినట్లు సమాచారం. డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని.. యూపీఏలో భాగస్వామి. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేశాయి. కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో..రాహుల్ గాంధీనే..తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని స్టాలిన్ … పదే పదే ప్రకటించారు. .యూపీఏలోని కొన్ని ఇతర పార్టీలు…ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌తో కలుస్తాయనుకుంటున్న పార్టీలు కూడా.. రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధం లేని పరిస్థితుల్లో కూడా…స్టాలిన్.. రాహుల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇదే విషయాన్ని కేసీఆర్‌కు… స్టాలిన్ చెప్పినట్లు సమాచారం.
కాంగ్రెస్‌తోనే కలిసి సాగుతామని చెప్పినట్లు డీఎంకే వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ముందుగా ప్రకటించినట్లుగా రాహుల్ ప్రధాని అయ్యేందుకు కూడా సహకరిస్తామని కూడా.. స్టాలిన్ కేసీఆర్ కు… నిర్మోహమాటంగానే చెప్పారని… కాంగ్రెస్ విషయంలో తమ వైఖరి మారబోదని కూడా స్పష్టం చేశారని.. డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. చివరిలో ఫలితాల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను స్టాలిన్ కోరినట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాలన్న అంశంలో మాత్రం స్టాలిన్ నుంచి కేసీఆర్ స్పష్టమైన హామీని రాబట్టుకోలేకపోయారు. సానుకూల స్పందన లేకపోవడంతో.. కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.