తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎలాగైనా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో అనేక మంది పార్టీల నేతల వద్దకు వెళ్తున్నారు. అయితే ఇంత వరకూ.. ఆయనకు ఏ ఒక్క పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ విషయంలో.. కేసీఆర్‌లో అసంతృప్తి ఉంది. తన తో పాటు.. నడవడానికి ఏ పార్టీ ఆసక్తి చూపకపోవడానికి… జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు పోషిస్తున్న పాత్రేనని ఆయన అనుకుంటున్నారు. అందుకే… ఎక్కడికి వెళ్లినా ఆయన చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం పెట్టుకోవద్దని… నేతలకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీ ఫలితాలపై కేసీఆర్ విశ్లేషణను తోసిపుచ్చిన స్టాలిన్..!
” ఏపీలో మీరు అనుకుంటున్నట్లుగా చంద్రబాబు గెలవడం లేదు. అక్కడ జగనే గెలుస్తారు. జగన్‌కు 20 వరకూ లోక్‌సభ సీట్లు వస్తాయి..” ఇది స్టాలిన్‌కు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాట. వెంటనే స్టాలిన్ అది మీ అభిప్రాయం.. అని తేల్చేశారు. అంతకు మించి ఏపీ ఫలితాలపై… కేసీఆర్‌తో డిస్కస్ చేయడానికి స్టాలిన్ అంగీకరించలేదు. ఈ విషయాన్ని చర్చల వివరాలు చెప్పడానికి వచ్చిన డీఎంకే నేత దొరైమురుగన్…చంద్రబాబుకు నేరుగానే చెప్పారు. అయితే.. స్టాలిన్ వద్ద ఏపీ ఎన్నికల ఫలితాలపై.. కేసీఆర్ ఎందుకు ప్రస్తావించారన్నది ఆసక్తికరం. టీడీపీ అధినేత చంద్రబాబు… బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపై ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లేలా చేయడానికే… చంద్రబాబు ఓడిపోబోతున్నట్లు స్టాలిన్‌కు కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై నమ్మకాన్ని తగ్గించే ప్రయత్నమా..?
ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఎలాగైనా కొన్ని పార్టీలను చేర్చుకునే ప్రయత్నంలో ఉన్న కేసీఆర్… ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు.. కలసికట్టుగా పోరాడటంతో.. అది ఇబ్బందికరంగా మారింది. ఈ సమయంలో… అదీ ఎన్నికల ఫలితాలు రాక ముందే… కేసీఆర్ ను నమ్మి కొత్త కూటమి వైపు రావడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో… చంద్రబాబుపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తే… తన వైపు వస్తారని.. కేసీఆర్ ఊహించినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇతర రాష్ట్రాల పార్టీలలో మాత్రం కేసీఆర్‌కు ఉన్న అబిప్రాయం లేదని.. స్టాలిన్ స్పందనను బట్టి చూస్తే తెలుస్తోంది. చంద్రబాబు అత్యధిక సీట్లు సాధిస్తారని.. చంద్రబాబు గెలుస్తారని.. డీఎంకే నమ్మకంతో ఉన్నట్లు.. కేసీఆర్ మాటల ద్వారానే తేలిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కేసీఆర్ చర్చల వివరాలను చంద్రబాబుకు చెబుతున్న పార్టీల అధినేతలు..!
కేసీఆర్.. కూటమి చర్చలకు.. వెళ్లి నాయకులతో జరుపుతున్న చర్చల వివరాలను… ఎప్పటికప్పుడు.. ఆయా పార్టీల నేతలు… దూతల ద్వారా.. చంద్రబాబుకు చేరవేయడం.. టీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. పోలవరం వంటి విషయాల్లో.. తీవ్రమైన విబేధాలున్నప్పటికీ.. ఒడిషా సీఎం… గతంలో.. కేసీఆర్ తో జరిపిన చర్చల వివరాలను… భేటీ తర్వాతి రోజే.. ప్రత్యేక దూత ద్వారా చంద్రబాబుకు చేరవేశారు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే పని చేశారు. చంద్రబాబు ఓడిపోతారని.. కేసీఆర్ ఎంతగా చెబుతున్నా.. ఆయా పార్టీల నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది కూడా టీఆర్ఎస్కి ఇబ్బందికరంగానే మారింది.