ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అదో ప్రహసనంగా ముగిసింది. ఆ ప్రహసనం మొత్తాన్ని.. పక్కాగా విశ్లేషించి.. ఐదు చోట్ల మాత్రం… రీపోలింగ్ నిర్వహిస్తే చాలని.. ఎన్నికల సంఘం తీర్మానించింది. ఆ మేరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు పోలింగ్ బూత్‌లలో పని పూర్తి చేసింది. ఇక కౌంటింగ్‌కు… ఏర్పాట్లు చేసుకుంటూండగా… హఠాత్తుగా ఎన్నికల సంఘం.. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో… రీపోలింగ్‌కు ఆదేశించింది. దీంతో.. ఆశ్చర్యపోవడం ప్రజల వంతయింది.
ఉరుములు లేని మెరుపులా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే రుడోలా ఉపఎన్నికల నోట్ విడుదల చేశారు. ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో అన్ని చోట్లా.. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు రీపోలింగ్ జరుగుతుందని.. ఆ ప్రకటన సారాంశం. ఎన్ఆర్ కమ్మపల్లి, పులివర్తి వారి పల్లి, కొత్త ఖండ్రిగ, కమ్మపల్లి, వెంకట రామాపురం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. కారణాలేమిటో మాత్రం చెప్పలేదు. కానీ.. కొద్ది రోజుల కిందట… వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఈసీని కలిసి… పోలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ.. ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా.. పది నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగాయని.. రీపోలింగ్ నిర్వహించాలని… ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే రీపోలింగ్ నిర్ణయం వెలువడింది.
నిజానికి రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటే… పోలింగ్ ముగిసిన తర్వాతే … రిటర్నింగ్ అధికారుల వద్ద నివేదికలు తీసుకుని.. ఆ మేరకు సీఈసీకి ప్రతిపాదనలు పంపేవారు. కానీ.. అలాంటి ప్రతిపాదనలేవీ… సీఈవోకు.. చిత్తూరు జిల్లా నుంచి రాలేదు. అయితే.. అభ్యర్థుల ఫిర్యాదు మేరకే… రీపోలింగ్ పై నిర్ణయం తీసుకుంటే మాత్రం.. ఆశ్చర్యకరమే. అయితే.. కచ్చితంగా అక్రమాలు జరిగాయన్న ఆధారాలు లేకపోతే.. రీపోలింగ్ కు ఆదేశించే పరిస్థితి.. ఉండదని… రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీంతో చంద్రగిరి విషయంలో అసలేం జరిగిందన్నది.. చర్చనీయాంశంగా మారింది.