ఆంధ్రప్రదేశ్‌లో గెలిస్తే ఏం చేయాలో… ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి వైసీపీ నేతలకు చాలా సమయం చిక్కింది. గ్రామస్థాయి నుంచి…వైసీపీ నేతలు… ఎక్కడికక్కడ ప్రభుత్వ పరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుని.. పనులు చేయవద్దని.. ఆదేశాలు ఇస్తూంటే.. రాష్ట్ర స్థాయిలో… కూడా.. తమకు మేలు చేసిన వారికి.. మంచి మంచి అవకాశాలు కల్పిస్తామనే భరోసాను.. గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ క్రమంలో నేరుగా.. జగన్ దగ్గర్నుంచి వెళ్లిందని చెబుతున్న ఓ ప్రతిపాదన.. కలకలం రేపుతోంది. ఆ ప్రతిపాదన.. ఐ ప్యాక్ సంస్థకు సంబంధించినది. ఆ ఐప్యాక్… వైసీపీకి ఎన్నికల్లో సహకరించిన ప్రశాంత్ కిషోర్ ది.
జగన్ ప్రభుత్వంలోనూ “ఐ ప్యాక్”ది కీలక పాత్రట..!
బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల వ్యూహకర్తగా పేరుంది. ఆయనను.. జగన్.. తన పార్టీకి సలహాలిచ్చేందుకు నియమించుకున్నారు. ఆ తర్వాత ఆ పని పరిధి విస్తృతమయింది. ఎంతగా అంటే.. ఆర్థిక, అంగ, సామాజికవర్గ బలాలను చూసి.. అభ్యర్థుల్ని కూడా ఆయనే ఖరారు చేశారు. ఎక్కడెక్కడ అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలో కూడా.. ఆయనే డిసైడ్ చేసినట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఆయన గొప్పగా సేవలు అందించారని అనుకున్న జగన్.. పోలింగ్ ముగిసిన తర్వాత నేరుగా ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి… ఆయనను అభినందించాు. వారిలో.. సీఎం.. సీఎం అనే నినాదాలు అందుకున్నారు. అప్పుడే .. ఈ ఐప్యాక్ కి… ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. హామీ ఇచ్చారట. ఇప్పుడు దానిపై.. లోటస్ పాండ్‌లో కసరత్తు కూడా జరుగుతోందని చెబుతున్నారు.
పీకే రుణం జగన్ అలా చెల్లించబోతున్నారా..?
వైసీపీకి సేవలు అందించేందుకు… ప్రశాంత్ కిషోర్ టీంతో.. చాలా పెద్ద మొత్తంతోనే.. జగన్ ఒప్పందం చేసుకున్నారన్న చర్చ చాలా రోజుల నుంచి నడుస్తోంది. అయితే.. ఎంత మొత్తం అనేది బయటకు రాదు. అది ప్రైవేటు వ్యవహారం కాబట్టి.. సైలెంట్‌గానే ఉండిపోయారు. కానీ వారికి.. అధికారంలోకి వస్తే.. ప్రభుత్వంలో కీలక బాధ్యలు ఇస్తామన్న హామీ ఇవ్వడమే కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ అనేది.. ప్రత్యేకంగా ఎలాంటి కార్యకలాపాలు లేని సంస్థ. రాజకీయ పార్టీలకు సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. కొన్ని సర్వేలు చేస్తున్నట్లు .. చెప్పుకునే సంస్థ మాత్రమే. ఈ సంస్థకు ఏపీ ప్రభుత్వంలో ఏ బాధ్యతలిస్తారనే చర్చ ప్రారంభమయింది. ఇప్పటికే.. లోటస్ పాండ్ క్యాంప్ … పీకే టీం మధ్య.. చర్చలు ప్రారంభమయ్యాయని.. మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రజలకు “ఐ ప్యాక్” ఎలాంటి పని చేస్తుంది..?
గతంలో ప్రశాంత్ కిషోరో బీహార్‌లో… జేడీయూ – ఆర్జెడీ పొత్తు కుదర్చడంతో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయనను నితీష్ కుమార్.. . సలహాదారునిగా నియమించుకున్నారు. ముఖ్యమంత్రి సలహాదారునిగా చాలా కాలం ఉన్నారు. అయితే.. ఊరకనే క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నారన్న విమర్శలు రావడంతో వదిలేశారు. ఇప్పుడు నేరుగా.. జేడీయూకి ఉపాధ్యక్షుడయ్యారు. కాబట్టి.. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వ సలహాదారుగా నియమితులు కావడం కష్టమే. ఆయన సంస్థకు మాత్రం… ఏదో కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉంది. పార్టీకి సేవలదించినందుకు.. ఇలా ప్రజల సొమ్మును ఇస్తున్నారనే విమర్శలు వచ్చినా.. వైసీపీ నేతలు లెక్కలోకి తీసుకునే చాన్స్ లేదు.