“మైండ్‌లో ఏది ఫిక్సయితే.. అది బ్లైండ్‌గా చేసేస్తానని”… ఓ సినిమాలో హీరో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్‌ను పేరడిగా మార్చి… మరో కమెడియన్కూ వాడుకున్నారు. కానీ.. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు.. కమెడియన్ బుర్రను కాకుండా మోకాలిని చూపిస్తూ ఉంటాడు. అందుకే అది హిలేరియస్ అయింది. ఇప్పుడు.. సాక్షి పత్రికలో వస్తున్న కథనాలు కూడా.. అంతే. ఇప్పుడు రవిప్రకాష్ ఎపిసోడ్ జరుగుతోంది కాబట్టి… ఏం జరిగినా… దానికి కలిపేయడం.. సాక్షి పత్రిక అలవాటు చేసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు ఏం చేసినా… రవిప్రకాష్ ను కాపాడటానికే అన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు హఠాత్తుగా.. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీతో భేటీకి కారణాలేమిటో ఎవరికీ తెలియదు కానీ.. సాక్షికి మాత్రం.. రవిప్రకాష్‌ని కాపాడటానికే అన్నట్లుగా… అనిపించింది. వెంటనే… ఓ కథనం రాసింది. దాని ప్రకారం.. రామేశ్వరరావుతో రామోజీరావుకు సన్నిహిత సంబంధాలున్నాయట. అందుకని.. రామోజీరావు ద్వారా రవిప్రకాష్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారట. చదవడానికి కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నా.. సాక్షి పత్రిక మాత్రం అచ్చేసింది. రామేశ్వరావు.. పారిశ్రామికవేత్తగా.. అత్యున్నత స్థాయికి చేరింది.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. ఆయనకు .. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి.. టీడీపీలోఉండి… రామేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సమయంలోనే.. ఆ రామేశ్వరరావు నేరుగా వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంత ఎందుకు.. మొన్నటికి మొన్న చినజీయర్ స్వామి కూడా చంద్రబాబును కలిసి ఆశీర్వచనాలు అందించారు. చినజీయర్ స్వామికి, రామేశ్వర్ రావుకు మధ్య అనుబంధం కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
టీవీ9 వాటాల అమ్మకం వివాదం.. కార్పొరేట్ వ్యవహారం. అది వీలైనంత త్వరగా పరిష్కారం అవ్వాలని.. రెండు వైపులా కోరుకోవడం సహజం. ఎందుకంటే.. అది సంస్థను.. చెడ్డ కారణాలతో వార్తల్లో లేకుండా చేయగలుగుతుంది. ఆ ప్రయత్నాల్లో రెండు వర్గాలు ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఈ కేసులు తేలిపోతాయని… నిన్నటి నుంచే కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో.. చంద్రబాబే రవిప్రకాష్ ను బయటపడేశాడని చెప్పుకునేందుకు… సాక్షి ఈ ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. .. తనకు టీవీ9 రవిప్రకాష్ అంటే ఇష్టం లేదు కాబట్టి.. అలాగే చంద్రబాబు అంటే.. రాజకీయ శత్రువు కాబట్టి… ఆ రెండింటికి లింక్ పెట్టేసి.. వారు ఏం చేసినా వార్తలు వండేయడం.. ఎబ్బెట్టగానే ఉంటుంది. కానీ సాక్షికి అది కొత్తేం కాదు. నిజంగా..చంద్రబాబు అలాంటి ప్రయత్నాలే చేయాలనుకుంటే.. నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లాల్సిన పని లేదు. ఓ ఫోన్ కాల్ సరిపోతుంది కదా..! సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ ఇలాంటి లాజిక్‌లు.. చాలా మిస్సవుతూంటారు..!
కొసమెరుపేమిటంటే… రామోజీరావును… జగన్మోహన్ రెడ్డి.. రెండు సార్లు ఫిల్మ్ సిటీకి వెళ్లి కలిశారు. అసలు.. రామోజీరావుకు సమాచారం ఇవ్వకుండా.. ఓ సారి భూమన కరుణాకర్ రెడ్డి తో వెళ్లారు. తన కుటుంబంలో పెళ్లి కార్డు ఇవ్వడానికి.. వెళ్తూ.. ఏ అపోహలు రాకుండా ఉండేందుకు.. జగన్ కు సమాచారం ఇచ్చేందుకు భూమన వెళ్లారు. విషయం తెలిసిన జగన్.. భూమనతో పాటు ఫిల్మ్ సిటీకి వెళ్లారు. బద్దశత్రువుగా భావించే రామోజీరావు దగ్గరకు.. జగన్ అలా వెళ్లింది దేనికోసమో…. సాక్షి పత్రికలో… ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ చంద్రబాబు, రామోజీ భేటీపై మాత్రం… తనకు ఏది అవసరమో.. అదే రాసేశారు.