‘నేను శైలజ’తో దర్శకుడిగా అడుగుపెట్టాడు కిషోర్ తిరుమల. ఆ సినిమా కిషోర్‌కే కాదు.. రామ్కీ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ వెంటనే ఉన్నది ఒకటే జిందగీ సినిమా తీశారు. నేను శైలజ రేంజులో ఆడకపోయినా… ఓకే అనిపించుకుంది. చిత్రలహరితో సాయిధరమ్ తేజ్కీ ఓ బ్రేక్ ఇవ్వగలిగాడు. ఇప్పుడు మళ్లీ రామ్‌తో ఓ సినిమా చేయడానికి కిషోర్ రెడీ అవుతున్నట్టు సమాచారం.
తమిళంలో ఇటీవల ‘తథమ్’ అనే సినిమా విడుదలైంది. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా రామ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. స్రవంతి మూవీస్‌లో ఈ సినిమాని రీమేక్ చేయాలని రామ్ భావిస్తున్నాడట. ప్రస్తుతం రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ రీమేక్‌పై దృష్టి పెట్టొచ్చు.