ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకిల్ వైపే మొగ్గారని…లగడపాటి రాజగోపాల్ వ్యక్తిగత అంచనాను వెల్లడించారు. ఆదివారం చివరి విడత పోలింగ్ ముగియనున్న నేపధ్యంలో.. ఆయన తిరుపతిలో…తన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తానని.. చెప్పేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫలితాలపై తన అంచనాను వెల్లడించారు.ఫలితాల కోసం ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని .. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎన్నికల్ని ప్రత్యేకంగా చూస్తున్నారనిచెప్పుకొచ్చారు. ఏపీ లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ప్రజలు సైకిల్నే ఎన్నుకున్నారని.. తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉంది కాబట్టి.. ప్రజలు కారు ప్రయాణాన్నే కోరుకుంటున్నారని లగడపాటి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో తన అంచనా తప్పు అయితే తెలంగాణలో నేను చెప్పిన చోట.. ఇండిపెండెంట్లు రెండో స్థానంలో వచ్చే వాళ్లు కాదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఏం జరిగిందో.. ఏపీలో తన సర్వే నిజం అయిన తర్వాత 23 తర్వాత వెల్లడిస్తానని లగడపాటి ప్రకటించారు. ఇప్పుడు చెబుతున్నది తన అంచనా మాత్రమేనన్న లగడపాటి..తన టీం టీమ్ శాస్త్రీయంగా పరిశీలించి.. చేసిన సర్వేను.. ఆదివారం సాయంత్రం తిరుపతిలో వెల్లడిస్తానన్నారు.
పవన్ కల్యాణ్ మెగాస్టార్ తమ్ముడు కాబట్టి.. మెగాస్టార్ కంటే కొంచెం తక్కువగానే ఉంటాడని…జనసేన ప్రభావంపై లగడపాటి విశ్లేషించారు. పవన్ కల్యాణ్ శాసనసభలోకి అడుగుపెడతాడని అభిప్రాయం వ్యక్తంచేశారు.కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం వస్తుందని ఏపీలో హంగ్ వచ్చే అవకాశమే లేదంటున్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ గజిబిజి తీర్పు ఇవ్వలేదు.. ఏపీ స్పష్టమైన మెజార్టీ ఒక పార్టీకే ఇవ్వబోతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి తాను అనుకూలంగా మాట్లాడటం లేదని… టీడీపీలో కంటే వైసీపీ నేతలతోనే నాకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయని గుర్తు చేశారు. జగన్తో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లగడపాటి చెప్పుకొచ్చారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి..అని.. అయితే అక్కడి ప్రజలు ఎలా తీర్పు ఇస్తారో వేచి చూడాలన్నారు.
ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. అందరూ ఆనందపడేలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని..రాజధానికి కూడా అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఐటీ, ఫార్మాలో అనేక ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. అమరావతిలాంటి రాజధాని ప్రపంచంలో ఎక్కడా లేదని.. రాజధానిని చూడటానికి వచ్చే వారి వల్ల టూరిజం పెరుగుతుందని అంచనా వేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం, ప్రతిపక్షం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజల నాడి తెలుసుకోవడం హాబీ అని లగడపాటి స్పష్టం చేశారు. సర్వే రిపోర్టు ముందే చెప్పాలని చాలా మంది అడిగినా… తానుచెప్పలేదని.. రాజధాని ప్రాంత రైతులకు మాత్రం చెవిలో చెప్పానన్నారు. చత్రపతిలో డైలాగ్ లా.. ఒట్టేసి ఓ మాట.. ఒట్టేయకుండా మరో మాట లేనట్లుగా.. లగడపాటి అంచనాకు.. ఆయన టీం వెల్లడించే సర్వే వేర్వేరుగా ఉండే అవకాశం లేదు.