ప్రాంతీయ పార్టీలన్నీ ఓ వైపు.. కలసికట్టుగా మారి.. కాంగ్రెస్‌కు బలం ఇచ్చే ప్రయత్నం చేస్తూంటే.. మిత్రపక్షాలు బీజేపీకి… లేనిపోని చిక్కులు తెచ్చి పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో ముందుగా… బీహార్ నేత.. జేడీయూ బయటకు వచ్చారు. భారతీయ జనతా పార్టీ… ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేసిన ఉమ్మడి సివిల్ కోడ్.. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ… మద్దతు ఇచ్చేది లేదని.. ఓటేసిన తర్వాత జేడీయూ చీఫ్… నితీష్ కుమార్ పట్నాలో ప్రకటించారు. అలాగే.. మహాత్మాగాంధీపై… ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దశాబ్దాల నుంచి తమ విజన్ క్లియర్ గా ఉందని… స్పష్టం చేశారు.
బీజేపీ విషయంలో కొంత కాలంగా… నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారు. ఒకప్పుడు ఆయన ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ.. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బయటకు వెళ్లిపోయారు. ఆర్జేడీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ… తర్వాత బీజేపీ ట్రాప్‌లో పడిపోయారు. సీబీఐను ప్రయోగించి.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలుకు పంపించేసి… ఆర్జేడీని ప్రభుత్వం నుంచి గెంటేసి… బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే… నితీష్ బ్యాడ్ లక్.. అప్పట్నుంచే.. బీజేపీపై దేశంలో వ్యతిరేకత కనిపించడం ప్రారంభమయింది. నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు.. బీహార్‌లో 30 శాతం వరకూ ఉన్న ముస్లింలు పూర్తిగా ఆర్జేడీ, కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారనే సూచనలు కనిపించడంతో.. నితీష్ కుమార్ అప్పుడప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు.
ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో … బీజేపీకి మెజార్టీ రావడం కష్టమని తేలుతున్న సమయంలో.. నితీష్ కుమార్ .. మళ్లీ… తన అసంతృప్తిని బయట పెడుతున్నారు. రేపు ప్రభుత్వ ఏర్పాటులో.. తాను కీలకం అయితే.. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన అంగీకించే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు.. జేడీయూ అధినేత చేతుల్లో ఉంది. దీంతో.. బీజేపీని వదిలించుకుందామనే ఆలోచన చేస్తున్నట్లుగా బీహార్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే..బీజేపీకి మరిన్ని చిక్కులే..!