మహేష్ బాబు 25వ సినిమాని ఓ మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చాడు వంశీ పైడిపల్లి. అందుకే మహేష్ వంశీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. మరో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేశాడు. మహేష్ – వంశీపైడిపల్లి సినిమా ఖాయమైపోయింది. 2020 వేసవిలో ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతోంది. మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఓసినిమా చేయబోతున్నాడు. ఆ వెంటనే పరశురామ్ సినిమా పట్టాలెక్కాలి. కానీ.. మహేష్ మనసు మార్చుకున్నాడని సమాచారం. పరశురామ్ సినిమాకంటే ముందు వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. అనిల్ రావిపూడి సినిమా 2020 సంక్రాంతికి విడుదల అవుతుంది. 2020 వేసవిలో వంశీ పైడిపల్లి చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. మరి ఈలోగా పరశురామ్ మరో సినిమా చేసుకొస్తాడా? లేదంటే అంత వరకూ మహేష్ కోసం ఎదురుచూస్తాడా అనే విషయాల్లో క్లారిటీ రావాల్సివుంది.