వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఫలితాలను… అమరావతిలోనే చూడాలని నిర్ణయించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూడా… విజయవాడకే చేరుకుంటున్నారు. చంద్రబాబు… గత పది రోజులుగా.. అమరావతిలో కన్నా ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హంగ్ పార్లమెంట్ ను చూపించి ఉంటే… ఆయన ఢిల్లీలోనే ఉండి ఫలితాలను చూసేవారేమో కానీ.. ఇప్పుడు మాత్రం అమరావతికే చేరుకుంటున్నారు.
ఫలితాల రోజు విజయవాడలోనే పవన్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారమే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. ఆయనతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా విజయవాడ చేరుకున్నారు. కౌంటింగ్ రోజున పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గానీ, విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఉంటారు. కొంత మంది సీనియర్లతో కలిసి పవన్ కల్యాణ్.. ఫలితాలను… చూసే అవకాశం ఉంది. నాదెండ్ల మనోహర్ తెనాలి జనసేన అభ్యర్దిగా పోటీ చేయడంతో ఆయన తెనాలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు వెళ్లాల్సి ఉంది. పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన భీమవరంకు కానీ…గాజువాకకు కానీ వెళ్లే అవకాశం లేదు. ఫలితాలను పార్టీ ఆఫీసులోనే చూడనున్నారు. ఇప్పటికే ఓసారి పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్దులతో మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
ఢిల్లీ కాదు అమరావతిలోనే చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పంలో గంగమ్మ జాతరలో పాల్గొననున్నారు. అక్కడ ఆలయానికి వెళ్లి పూజల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు ఈ పూజలో పాల్గొని అనంతరం తిరిగి బెంగుళూరు వెళతారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా అమరావతికి చేరుకోనున్నారు. ఆయన ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ నేతలతో పోటీ చేసిన అభ్యర్దులు, ఏజెంట్లు, బూత్ కమిటీ కన్వీనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ పై ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అక్కడే ఉన్న అభ్యర్ధితో మాట్లాడాలని, అవసరమైతే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, చంద్రబాబుకు పోన్ చేయాలని కూడా సూచించారు.
జగన్ కేరాఫ్ తాడేపల్లి…!
వైసీపీ అధినేత కూడా ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడే ఫలితాలను చూస్తారు. పార్టీ నేతలకు.. ట్రైనింగ్ ఇవ్వడం కన్నా.. పక్క పార్టీ సన్నద్దతను విమర్శించడానికే.. వైసీపీ ఎక్కువ దృష్టి పెట్టింది. గెలుస్తామన్న ధైర్యంతో.. వైసీపీ ఏమీ లెక్క చేయడం లేదు. అన్నీ… వ్యవహారాలను లైట్ తీసుకుంది. అయితే.. కౌంటింగ్ మాత్రం… ఎవరూ అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితులు కనిపించడం లేదు.