సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని ముందుకెళతామని.. టీడీపీ అధినేత చెబుతూ ఉంటారు. ఆయనవన్నీ మాటలే… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు సవాళ్లను అధిగమించి.. ఆంధ్రప్రదేశ్లో అనితరసాధ్యమైన విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి…గత పదేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పటి నుంచి అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. ఓ వైపు సీబీఐ కేసుల్లో విచారణ… మరో వైపు… ప్రతీ వారం కోర్టుకెళ్లే పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. భారతీయ జనతా పార్టీతో.. టీడీపీ పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ సమయంలో.. బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తుకే ఆసక్తి చూపించిందని ప్రచారం జరిగింది. కానీ.. జగన్ మాత్రం ఆసక్తి చూపించలేదు.
అయితే.. వ్యూహాత్మకంగా ఆయన రాజకీయం చేసారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ…జగన్ కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. అన్నింటినీ ఎదుర్కొన్నారు. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి.. పార్టీని అత్యంత సమర్థంగా నడిపారు. ఆయనకు సలహాలివ్వడానికి అందరూ ముందుకు వస్తారు. అందుకే సీనియర్ నేతల్ని ఎవర్నీ దగ్గరకు రానీయలేదు. ఒకే ఒక్క విజయసాయిరెడ్డి, ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్తోనే పనులు చేయించారు. అనుకున్నది అనుకున్నట్లు రాజకీయ వ్యూహాన్ని అమలు చేయగలిగారు. అనుకున్న దాని కంటే అద్భుతమైన ఫలితాన్ని సాధించగలిగారు.
జగన్ నాయకత్వ సామర్థ్యంపై.. చాలా మంది నేతలు సందేహాలు వ్యక్తం చేసేవారు. అయితే.. తాను కొత్త తరానికి ప్రతినిధినని.. ఔట్ డేటెడ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. తేల్చారు. దానికి తగ్గట్లుగానే… తన వ్యూహాలు అమలు చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా… వెనక్కి తగ్గలేదు. టీడీపీపై పోరాటంలో వినూత్న పంథా అవలంభించారు. ఎప్పుడూ లేని విధంగా… అసెంబ్లీని నిరవధికంగా.. బహిష్కరించినా…. హైదరాబాద్ నుంచే రాజకీయం చేసినా… ప్రజల మద్దతు పొందగలిగారు. సవాళ్లను… అవకాశాలుగా మల్చుకోవడం.. వైసీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.. అని.. నిరూపించుకున్నారు.