తనను తాను టీడీపీ మోసం చేసుకుంది. ఏడాదిన్నర కిందట.. నంద్యాల ఉపఎన్నికలు జరిగాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. పైగా.. వైసీపీ అండగా ఉంటారనుకున్న వర్గాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. అందుకే… వైసీపీ గెలుపు ఖాయమని ప్రచారం జరిగింది. టీడీపీపై చాలా వ్యతిరేకత ఉందని… ఓడిపోవడం ఖాయమని చెప్పుకునేందుకు మైండ్ గేమ్ ఆడారు. జగన్మోహన్ రెడ్డి కూడా… నంద్యాలలో.. పదిహేను రోజుల పాటు ప్రచారం చేశారు. ఓ పార్టీ అధ్యక్షుడు..ఓ అసెంబ్లీ స్థానంలో పదిహేను రోజుల పాటు ప్రచారం చేసిన వైనం ఎక్కడా లేదు. ఇక.. అక్కడ తిరుగులేని విజయం.. వైసీపీదేనననుకున్నారు. కానీ ఫలితం తేడా కొట్టింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పుడు వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. కానీ జగన్ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ వెంటనే పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకువచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని టీడీపీ నేతలు పదే పదే ప్రచారం చేశారు. ఎంతగా.. అంటే.. ప్రజలు కూడా.. నిజమే అనుకునేలా ఆ మైండ్ గేమ్ నడిచింది. సోషల్ మీడియాలో.. ఈ ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారం వల్ల.. టీడీపీ నేతలు.. ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లారు. వైసీపీ నేతలు అభద్రతా భావానికి గురయ్యారు. కానీ ఓటర్లు మాత్రం గందరగోళానికి గురి కాలేదు. తమకు ఎవరు కావాలో.. వారినే… ఎంచుకున్నారు. ఆ విషయం ఓటింగ్ లో స్పష్టమయింది.. ఇలాంటి మైండ్ గేమ్‌తో.. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి మేలు చేసింది. ఎందుకంటే… సాధారణంగా ఏదైనా పార్టీ ఎప్పుడైనా గెలుస్తుందనే.. ఫీలింగ్ వస్తే.. ఆ పార్టీకి చెందిన ఓటర్లు.. ఓటింగ్ వరకూ వెళ్లడానికి బద్దకిస్తారు. వైసీపీ నేతలు చేసిన ప్రచారంతో.. ఎక్కడెక్కడో ఉన్న వారంతా… ఓ భావోద్వేగం వారిలో కనిపించింది. జగన్ ను సీఎం చేశారు.
అదే సమయంలో.. టీడీపీ మైండ్ గేమ్… ఆ పార్టీకి నష్టం చేసిందని.. కొన్ని కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఓడిపోయిన విషయంతో తేలిపోయింది. ఇక గెలుపే మిగిలిందనుకున్న పార్టీల నేతలు.. చాలా మంది.. ఎన్నికల ఖర్చును.. మధ్యలోనే ఆపేశారని… ప్రచారం జరుగుతోంది. ఫలితంగా…టీడీపీ ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదని.. ఫలితాల సరళిని బట్టి తేలిపోతోంది… మొత్తానికి మైండ్ గేమ్ రాజకీయాలు.. సక్సెస్ కావని.. ఈ ఎన్నికలు.. టీడీపీ మరోసారి గుణపాఠంగా చెప్పినట్లయింది.