‘సైరా’లో గ్లామర్ తళుకులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే నయనతార, తమన్నా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు అనుష్క కూడా తోడైంది. అనుష్కకు `సైరా`లో ఓ కీలక పాత్ర దక్కిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంబోతోందని, స్వీటీ మరింత గ్లామరెస్గా కనిపించబోతోందని టాక్. ఈవారంలోనే అనుష్క ‘సైరా’ సెట్లో అడుగుపెట్టబోతోంది. అనుష్కపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తే… ‘సైరా’ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. తొలుత అనుష్క పాత్రని కొన్ని సన్నివేశాలకే పరిమితం చేద్దామనుకున్నారు, అయితే ఇప్పుడు ఓ పాటలో కూడా అనుష్కని వాడుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ షెడ్యూల్తో `సైరా` టాకీ మొత్తం పూర్తవుతుంది. ఈయేడాది అక్టోబరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిరంజీవి ఆలోచన. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. త్వరలోనే సైరా నుంచి చిరంజీవి కొత్త లుక్ కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి.