సినిమాల్లోగానీ, రాజకీయాల్లోగానీ ఓ ముద్ర పడిపోతే.. దాన్ని చెరుపుకోలేం. రోజాపై కూడా అలాంటి ముద్ర ఒకటి ఉంది. ఐరెన్ లెగ్ అని. రోజా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అప్పుడప్పుడు ఛలోక్తులు విసురుకుంటుంటారు. రోజా కాంగ్రెస్లో చేరాక వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హైలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. వైకాపాలో చేరినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. అప్పటి నుంచీ రోజాపై ఐరెన్ లెగ్ ముద్ర అలానే ఉంది. ఇప్పుడు నగరి నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైంది రోజా. తన పార్టీ కూడా అధికారంలోకి వచ్చేసింది. ఈ సారి రోజాకి మంత్రి పదవి ఖాయం అంటూ ప్రచారం సాగుతోంది. మొత్తానికి రాజకీయాల్లోనూ రోజాకి మంచి రోజులు వచ్చేసినట్టే. అన్నింటికంటే ముఖ్యంగా ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిగిపోయినట్టే. ఈ ఎన్నికల్లోనూ రోజా గెలిచి, వైకాపా రాకపోతే మాత్రం.. రోజా ఎప్పటికీ `ఐరెన్లెగ్`గానే మిగిలిపోదును. ఆ అపప్రద ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది.