సినిమా పరిశ్రమలో లేడీ డైరక్టర్స్ చాలా తక్కువమందే ఉన్నారు. తెలుగులో మొన్నటిదాకా బి.జయ మూడు నాలుగు సినిమాలు చేసింది. ఇప్పుడు నందిని రెడ్డి కూడా తన మూడో సినిమాతో రాబోతుంది. మొదటి సినిమా అలా మొదలైందితో మంచి హిట్ కొట్టి పరిశ్రమలో లేడీ డైరక్టర్స్ సత్తా చాటిన ఈమె రెండో సినిమా జబర్దస్థ్ చేసిన గొడవలు మూకలతో డీలా పడ్డది. ఇక మూడో ప్రయత్నంగా చేసిన కళ్యాణ వైభోగమే కూడా రిలీజ్ గందరగోళంలో పడింది.
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా దామోదర ప్రసాద్ నిర్మించారు. అయితే ముందు ఈ సినిమా జనవరి 22వ తారీఖే విడుదల చేద్దామనుకున్నా సంక్రాంతి సినిమాల సందడిలో కొట్టుకుపోతుందని భావించి ఫిబ్రవరి 5న విడుదల చేస్తామని ప్రకటించారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం కళ్యాణ వైభోగమే సినిమా 5న కూడా రావట్లేదట. సినిమా రిలీజ్ కాకపోడానికి కారణాలు కేవలం థియేటర్స్ సమస్య వల్లనే అట.
ప్రస్తుతం పోటీ పడుతున్న చిన్న సినిమాల్లో కూడా తరచూ ఈ థియేటర్స్ సమస్య ఏర్పడుతుంది.. చిన్న సినిమాలే అయినా అవి బడా డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉండటమే దీనికి కారణం.. మేజర్ థియేటర్స్ అన్ని వారి చేతిలో ఉండబట్టే ఇలాంటి సినిమాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. మరి వీటి గురించి నిర్మాతల మండలి ఏమన్నా కలుగ చేసుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం వాయిదా పడ్డ కళ్యాణ వైభోగమే సినిమా విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.