‘రణరంగం’… శర్వానంద్ కొత్త సినిమా ఇది. సుధీర్ వర్మ దర్శకుడు. ఆగస్టులో విడుదల కానుంది. నిజానికి ఈ వేసవి బరిలో నిలవాల్సిన సినిమా ఇది. షెడ్యూల్స్ మధ్య గ్యాప్ రావడం, అనుకున్న ప్రకారం షూటింగ్ జరక్కపోవడంతో ‘రణరంగం’ ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి, షూటింగ్ సజావుగా జరక్కపోవడానికి శర్వానే కారణమని నిర్మాత సూర్యదేవర నాగవంశీ కాస్త గుర్రుగా ఉన్నాడట. ‘పడి పడి లేచె మనసు’, ‘రణరంగం’ షూటింగులు రెండూ సమాంతరంగా సాగాయి. అయితే `పడి పడి లేచె మనసు` ముందే విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్‌తో శర్వా నిరాశకు లోనయ్యాడని, అందుకే తరచూ `రణరంగం`షూటింగ్‌కి డుమ్మా కొట్టేవాడని తెలుస్తోంది. శర్వా మూడ్ అప్ సెట్ అవ్వడం వల్ల చాలాసార్లు `రణరంగం` షూటింగ్ కి పేకప్ చెప్పాల్సివచ్చిందట. ఈ సినిమా ఆలస్యం అవ్వడంతో బడ్జెట్ కూడా పెరుగుతూ వెళ్లిందని, అందుకే శర్వా తీరుతో నిర్మాత అప్ సెట్ అయ్యాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా శర్వాకీ నిర్మాతకీ మధ్య బాండింగ్ సరిగా లేదని చెప్పుకుంటున్నారు. ఓ సినిమా ఫ్లాప్ అయితే, కసిగా రెండో సినిమా చేయాలి గానీ, ఆ బాధతో మరో సినిమాని పాడు చేయడం ఎంత వరకూ కరెక్ట్ …? ఈ విషయంలో శర్వా తనని తాను సరిదిద్దుకోవాల్సిందే.