‘చిత్రలహరి’తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు మారుతి తో ఓ సినిమా చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘ప్రతిరోజూ పండగే’, ‘భోగి’ లాంటి పేర్లు పరిశీలిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. దానికి తగ్గట్టుగానే ‘భోగి’ అనే పేరు కూడా సూటయ్యేలా చూసుకుంటున్నారు. ఒకవేళ సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం లేకపోతే… ‘ప్రతి రోజూ పండగే’ అనే పేరు పెడతార్ట. సాయిధరమ్ తేజ్ సినిమా సంక్రాంతి బరిలో నిలవడం ఇదే మొదటిసారి. మారుతి సినిమాలు కూడా ఇంత వరకూ సంక్రాంతికి విడుదల కాలేదు. 2020 సంక్రాంతికి పెద్ద సినిమాల హడావుడి బాగానే కనిపించే అవకాశాలున్నాయి. మహేష్ బాబు – అనిల్ రావిపూడి చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేద్దామనుకుంటున్నారు. మహేష్ సినిమాతో పాటు వేరే పెద్ద సినిమాలేమైనా వస్తే… సాయిధరమ్ తేజ్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటాడు. లేదంటే… ‘భోగి’ రోజున బొమ్మ పడడం ఖాయమని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా ‘నేల టికెట్’ భామ మాళవిక శర్మని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. చిత్రబృందం ఇంకా ఖరారు చేయలేదు.