స్టీఫెన్ రవీంద్రతోనే… ఈ వ్యవహారం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ తో పాటు అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న చాలా మంది అధికారులు ఇప్పుడు.. తెలంగాణ క్యాడర్లో ఉన్నారు. వారంతా.. ఏపీ వైపు చూస్తున్నారు. ఇలాంటి అధికారుల్లో..ఎక్కువగా ప్రచారం పొందిన అధికారిణి శ్రీలక్ష్మి. అత్యంత చిన్న వయసులో.. ఐఏఎస్‌కు ఎంపికై… సర్వీస్‌లో రిమార్కులు లేకపోతే… చీఫ్ సెక్రటరీ అవడానికి అన్ని అర్హతలు ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఓబుళాపురం మైనింగ్ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవ్వాల్సి వచ్చింది. ఆరోగ్యాన్ని కూడా కోల్పోయారు. చాలా కాలం తర్వాత… ఆమె.. విధుల్లో చేరారు. తెలంగాణలో సర్కారులో ఓ అప్రాధాన్య పోస్టులో ఉన్నారు. ఇప్పుడు.. ఈ శ్రీలక్ష్మి కూడా.. ఏపీ క్యాడర్‌కు వెళ్తానని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
జగన్‌తో పాటు కేసుల్లో ఇరుక్కున్న వారికి మంచి రోజులు..!
గాలి జనార్ధన్ రెడ్డికి అప్పనంగా మైన్స్ కట్టబెట్టిన వ్యవహారంలో.. జగన్ అక్రమాస్తుల కేసులో.. అనేక మంది ఐఏఎస్ అధికారులు… ఇరుక్కున్నారు. వారందరిపై.. చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. చాలా మందిపై.. విచారణకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో.. బయటపడ్డారు. అయితే అది పూర్తి స్థాయిలో కాదు. ఏదో కోర్టులో వారిపై… విచారణ జరపాలా.. వద్దా.. అన్న.. పిటిషన్లు ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో .. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆయన ఎమ్మార్ కేసులో నిందితుడు. ఆయనకు తెలిసే స్కాం జరిగిందని.. సీబీఐ స్పష్టంగా వాదిస్తోంది. ఇప్పుడీ కేసు సుప్రీంకోర్టులో ఉంది.
వైఎస్ హయాంలో వెలుగు వెలిగిన వారంతా మళ్లీ ఏపీకి..!
వైఎస్ హయాంలో.. ఓ వెలుగు వెలిగిన అధికారులు చాలా మంది.. టీడీపీ గెలిచిన తర్వాత .. ఏపీ క్యాడర్‌కు రావడానికి ఇష్టపడలేదు. చాలా మంది తెలంగాణలో.. కొంత మంది.. ఢిల్లీ సర్వీసులకు వెళ్లిపోయారు. అలాంటి వారంతా.. ఇప్పుడు… ఏపీకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా.. డిప్యూటేషన్లు… కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న వారికి ఉంటాయి. కానీ.. ఇప్పుడు… పొరుగు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున సివిల్ సర్వీస్ అధికారులు ఏపీకి వస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం.. ఇప్పటి వరకూ ఏపీలో పని చేయని వాళ్లతోనే నిండిపోయే అవకాశం కనిపిస్తోంది.