ప్రతీ ఏడాది ఎన్టీఆర్ జయంతి వచ్చినా.. వర్థంతి వచ్చినా… ఎన్టీఆర్ ఘాట్ వద్ద.. అద్భుతమైన ఏర్పాట్లు జరిగేవి. వివిధ రకాల పుష్పాలతో… అలంకరణ చేసేవారు. సర్వమత ప్రార్థనలు లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది మాత్రం.. అలాంటివేమీ కనిపించలేదు. కనీసం ఘాట్‌ను శుభ్రపరచలేదు. ఎందుకిలా జరిగింది..?
ఇప్పటి వరకు ఎవరు ఏర్పాట్లు చేశారో ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెలుసా..?
యుగపురుషుడి జయంతి లేదా వర్థంతి వస్తే… పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తరలి వచ్చేవారు. ఉదయమే.. అందరూ వచ్చి నివాళులు అర్పించి వెళ్లేవారు. రాజకీయ ఎజెండాలు, చంద్రబాబుపై కోపం ఉంటే… నివాళులర్పించి… మీడియా ముందు తమ కోపం వెళ్లగక్కేవారు. లక్ష్మిపార్వతి లాంటి వాళ్లయితే… ఇక వెనక్కి తగ్గనే తగ్గరు. వారు అక్కడ చక్కని ఏర్పాట్ల మధ్య నివాళులర్పించి… తమ రాజకీయం తాము చేసుకుని వెళ్లిపోతారు. కానీ ఆ ఏర్పాట్లు ఎవరు చేశారో.. వారికి తెలియదు. ఎప్పుడూ తెలుసుకోలేదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరో చేస్తారు… తామొచ్చి నివాళులు అర్పించి పోవడమే తమ పని అనుకున్నారు. కానీ ఈ ఏడాది అది రివర్స్ అయింది.
పర్యవేక్షణ మొత్తం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీది..!
నిజానికి ఎన్టీఆర్ ఘాట్… ఎన్టీఆర్ కుటుంబసభ్యులది కాదు. ఆయన వారసులది అసలే కాదు. లక్ష్మీపార్వతిది కూడా కాదు. అది పూర్తిగా.. గవర్నమెంట్ అధీనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల టూరిజం కోసం… చంద్రబాబు హయాంలో బుద్ధపూర్ణిమ ప్రాజక్ట్ అధారిటీని ఏర్పాటు చేశారు. అ అథారిటీ అధీనంలో ఉంటుంది. మొయిన్టనెన్స్ మొత్తం.. .ఆ అధారిటీనే చేయాలి. జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లను కూడా.. ఆ అధారిటీనే చేయాలి. ఎందుకంటే… అదో టూరిజం ప్రాజెక్ట్. పర్యాటకుల నుంచి టిక్కెట్లు వసూలు చేస్తారు. కాబట్టి… ఆ బాధ్యత వారికి ఉంది. గతంలో చేసిన ప్రాజెక్ట్ అధారిటీ తర్వాత చేయడం మానేసింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలంకరణ బాధ్యతలు తీసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్..!
ప్రాజెక్ట్ అధారిటీ చేసే ఏర్పాట్లపై.. పెద్దగా నమ్మకం లేని తెలుగుదేశం పార్టీ జయంతి, వర్థంతిలతో పాటు… అసెంబ్లీ సమావేశాలకు… వెళ్లేటప్పుడు… ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో.. ప్రత్యేకంగా… అలంకరించేవారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు దీన్ని చూసేవి. కానీ.. కొన్నాళ్లుగా… ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పూర్తిగా అమరావతి తరలి పోయింది. ఎన్నికల హడావుడిలో పడిపోయి… ఓటమి బాధలో మునిగిపోయి.. గుంటూరులో ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవాలని నిర్ణయించుకున్న టీడీపీ వర్గాలు.. హైదరాబాద్ గురించి ఆలోచించలేదు. వాళ్లే ఆలోచించలేదు కాబట్టి.. తమకెందుకని.. తెలంగాణ ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఎప్పట్లాగే … విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పూలతో అలంకరించి ఉంటారని.. వచ్చిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు షాక్ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ అసహనానికి గురైనట్లు కనిపించారు.