బంగారపు పళ్లానికైనా గోడ చేర్పు కావాలి. ఎంత గొప్ప మీడియా అయినా, ప్రభుత్వం అండ కావాల్సిందే. గత అయిదేళ్లుగా ఆంధ్రజ్యోతి రాజ్యం నడిచింది. ప్రకటనలు, ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వచ్చింది. ఇప్పుడు సాక్షి టైమ్ వచ్చింది. తొలిసారిగా ఈ రోజే బోణీ.
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సాక్షిలో ప్రకటనలు కుమ్మేసారు. ఆంధ్రజ్యోతికి సింగిల్ ప్రకటనే మిగిలింది. ఈనాడుకు రెండు మూడు వచ్చాయి. సాక్షి మాత్రం పేజీలకు పేజీలు. తెలుగుదేశం అనుకూలం అని పేరు పడ్డ సంస్థలు కూడా అర్జెంట్ గా పోటీ పడి సాక్షిలో ప్రకటనలు ఇచ్చాయి.
అయితే ఇక్కడ ఇంకో చిత్రమైన విషయం వుంది. సాధారణంగా ప్రకటనలు ఇచ్చిన వన్నీ సంస్థలే. వ్యక్తుల పేర్లు చాలా అంటే చాలా తక్కువ. కేవలం చెవిరెడ్డి భాస్కరరెడ్డి ది మాత్రమే వుంది. దీని వెనుక బలమైన కారణం వుంది అని తెలుస్తోంది.
ప్రకటనలో వైఎస్ జగన్ ఫొటో, మహా అయితే వైఎస్ఆర్ ఫొటో తప్పిస్తే మరో ఫొటో వుంటే ప్రకటన తీసుకోమని సాక్షి మేనేజ్ మెంట్ జనాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు ఇచ్చిన ప్రకటనలు కూడా క్యాన్సిల్ అయ్యాయని బోగట్టా. వ్యక్తిగతంగా ప్రకటన ఇచ్చి, కిందన తమ ఫొటో వేసుకోవాలని అనుకోవడం కామన్. కానీ అలా ఎప్పుడయితే ఫొటో వుండకూదని అన్నారో? కేవలం సంస్థల తరపునే ప్రకటనలు ఇచ్చారు.
ఈ ఒక్క నిబంధన లేకుంటే ఇంకా ప్రకటనలు కుమ్మేసేవేమో? చాన్నాళ్ల క్రితం హీరో రాజశేఖర్ ను తన పక్కన కళ్లజోడు పెట్టుకుని, గ్లామరస్ దుస్తులు వేసుకుని వుండవద్దని జగన్ చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ ప్రకటనల కండిషన్ చూస్తుంటే అదే గుర్తుకువస్తోంది.
అన్నట్లు వినిపిస్తున్న ఇంకో గ్యాసిప్ ఏమిటంటే, సాక్షి ప్రకటనల రేట్లు పెంచే ఆలోచనలో వుందనో? పెంచేసింది అనో? అవకాశం వచ్చినపుడే కదా… కానివ్వండి.