జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే… సీఎంవోలో.. కీలకంగా వ్యవహరించిన అధికారులందర్నీ బదిలీ చేసేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరూ సతీష్ చంద్ర ఉన్నారు. అలాగే..సీఎం ముఖ్యకార్యదర్శిగా సాయిప్రసాద్, సీఎం కార్యదర్శులు గిరిజా శంకర్, రాజమౌళిలపైనా వెంటనే బదిలీ వేటు పడింది. వీరందర్నీ సాధారణ పరిపాలనశాఖకు రిపోర్ట్ చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వీరి బదిలితో పాటు తొలి నియామకాన్ని కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యంజరిపారు. సీఎం అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డిని నియమించారు. ధనుంజయరెడ్డి ఇప్పటి వరకూ..టూరిజం శాఖ ఎండీగా ఉన్నారు.
ఏపీలో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ ఎక్కడిక్కడ నిలిపివేస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ప్రారంభించిన అభివృద్ధి పనుల వల్ల భారం పడిందని… వాటిని నిలిపివేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ప్రాధాన్యతల్ని పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజెక్టు పనుల్ని సమీక్షించాలని ఆదేశించారు. ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముదు మంజూరై ప్రారంభించని పనుల్ని రద్దుచేయాలని ఆదేశించారు. 25శాతం పనులు కాని ప్రాజెక్టుల చెల్లింపులు చేయొద్దని సూచించారు. సీఎస్ ఉత్తర్వులతో.. ఇక ఏపీలో ఏ ఒక్క అభివృద్ధి పనికి.. నిధులు చెల్లింపు జరిగే అవకాశం లేదు. ఎక్కడికక్కడ పనులు ఆగిపోనున్నాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్… ఢిల్లీ పర్యటన రద్దయింది. జగన్ ప్రమాణస్వీకారం తర్వాత అందరూ కలిసి.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే.. దానికి తగ్గట్లుగా ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి ల్యాండింగ్‌కు అనుమతి తీసుకోలేకపోయారు. చివరి క్షణంలో… వీరి విమానానికి ఏటీసీ పర్మిషన్ నిరాకరించింది. మోడీ ప్రమాణస్వీకారం సందర్భంగా.. ఢిల్లీలో నాలుగు గంటల తర్వాత ముందస్తుగా షెడ్యూల్ ఖరారైన విమానాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. చివరి క్షణంలో… ఏ విమానానికి అనుమతి ఇవ్వడం లేదని.. ఏటీసీ తేల్చి చెప్పింది. మోడీ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున అతిధులు వస్తున్నందున… ఢిల్లీ విమానాశ్రయం బిజీగా ఉంది. ల్యాండయ్యే, టేకాఫ్ అయ్యే విమానాలతో బిజీగా ఉండటంతో… అనుమతి నిరాకరించారు. మామూలుగా అయితే.. జగన్ ప్రమాణస్వీకారం.. ఒంటి గంటలోపు ముగుస్తుందని.. ఆ తర్వాత వెంటనే ఢిల్లీకి బయలుదేరితే… ప్రమాణస్వీకారానికి అందుకోవచ్చని అనుకున్నారు. కానీ ప్రమాణస్వీకారం సమయంలో.. సర్వమత ప్రార్థనలు ముప్పావు గంట సేపు సాగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కూడా అరగంటకుపైగా సాగింది. ఆ తర్వాత ఇతర లాంఛనాలు పూర్తి చేసే సరికి రెండు దాటిపోయింది. ఆ తర్వాత స్టాలిన్, కేసీఆర్ ను తీసుని జగన్ ఉండవల్లిలో తన నివాసానికి..విందుకు వెళ్లారు. అప్పుడు… ప్రత్యేక విమానం ప్రయాణానికి ఏటీసీ పర్మిషన్ అడిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో.. ప్రోగ్రామ్ టూర్ క్యాన్సిల్ అయింది.