సాహో సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ సినిమా. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్. ఇది ఇంకా పెరిగేలాగే వుంది. సాహో టీజర్ రెడీ అవుతోంది. దీని కోసం ఓ హాలీవుడ్ మ్యూజిక్ బిట్ ను కొనుగోలు చేసారని తెలుస్తోంది. దాని కోసం ఏకంగా 15లక్షలు రాయల్టీ చెల్లించినట్లు తెలుస్తోంది.
థమన్ నో, మరొకరినో చేయమంటే మహా అయితే లక్షో, రెండు లక్షలో ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఖర్చు కాదు. సెకండ్ల నిడివి వుండే టీజర్ కు. కానీ సాహో సినిమా కదా? అన్నీ భారీగానే వుండాలి. ఎక్కడ విన్నారో? ఎవరికి నచ్చిందో? ఓ మ్యూజిక్ బిట్ ను 15లక్షలు రాయల్టీ ఇచ్చి, టీజర్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది.
మరి ఇలా ఖర్చు చేస్తుంటే మూడు వందల కోట్లేమీ? ఇంకా ఎక్కువే ఖర్చు అయినా ఆశ్చర్యం లేదు. సాహో సినిమా ఆగస్టు 15న విడుదలకు రెడీ అవుతోంది.