వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే… డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను… ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి పంపించేశారు. కొత్తగా.. గౌతం సవాంగ్‌కు చాన్సిచ్చారు. ఆయన బాధ్యలు తీసుకున్న తర్వాత మీడియాతో చాలా విషయాలు మాట్లాడారు. తాను విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు నమోదు చేసిన కాల్‌మనీ కేసు గురించి మాట్లాడారు కానీ.. అంతకు మించిన సంచలనాత్మక కేసుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
వైఎస్ వివేకా హత్య కేసు గౌతం సవాంగ్‌కు అసలైన సవాల్..!
కొత్త డీజీపీ ముందు ఉన్న అసలైన సవాల్ వైఎస్ వివేకా హత్య కేసును చేధించడం. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న గౌతం సవాంగ్.. ఈ విషయంలో.. ఆయన తన ముద్రను.. మరింత బలంగా ఉండేలా చూసుకుంటే… దేశవ్యాప్తంగా ఆయన పేరు ప్రతిష్టలు మరింత పెరిగిపోతాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు.. అత్యంత దారుణంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్ సొంత బాబాయి అయిన వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యను దాచి పెట్టేందుకు బంధువులు ప్రయత్నించారు. ఇదంతా.. పక్కాగా అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపినప్పటికీ.. ఒక్క విషయాన్ని కూడా ఇంకా బయటకు తీసుకురాలేకపోయారు. సాంకేతికంగా… హత్య గురించిన పూర్తి ఆధారాలు పోలీసులకు దొరికినా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కేసును చేధించలేకపోతే పోలీసులకు చెడ్డపేరే..?
నిజానికి ఓ చిన్న క్లూని పట్టుకుని .. ఎన్నో మర్డర్ కేసుల్ని పోలీసులు… సాంకేతిక ఆధారాలతో.. చేధించారు. కానీ పక్కాగా.. సాక్ష్యాలు ఉండి.. అన్ని సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించిన వారు కళ్లముందే ఉన్నప్పటికీ.. పోలీసులు.. ఎలాంటి ఆధారాలు దొరకలేదని… వారు నోరు విప్పడం లేదని చెప్పడం… సామాన్య ప్రజల్ని నమ్మించేలా లేదు. ఈ కేసును ఓ లాజికల్ కంక్లూజన్‌కు తీసుకురాకపోతే.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు పూర్తి స్థాయిలో అనుమానం కలుగుతుంది. ఈ పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత సవాంగ్పైనే ఉంది.
కోడికత్తి కేసులో అసలు నిందితుల్ని పట్టుకుని తీరాలి..!
ఎన్నికలకు ముందు సంచలనాత్మకం అయిన కేసుల్లో ఒకటి కోడికత్తి కేసు. సాక్షాత్తూ.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై… శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. దాన్ని చంద్రబాబే చేయించారని… జగన్ ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులపైనా ఆయన ఆరోపణలు చేశారు. అందుకే.. ఈ కోడి కత్తి కేసులో.. అసలు నిజాలను బయటకు తీసుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే నిందితుడికి బెయిల్ వచ్చింది. ఎన్ఐఏ కూడా విచారణ జరిపింది. ఇందులో నిందితులు ఎవరైనా.. చతర్యలు తీసుకుని తీరాల్సిందే..!
జగన్‌కు ఏపీ పోలీసులపై ఎంతో గౌరవం..!?
జగన్‌కు ఏపీ పోలీసులపై ఎంతో గౌరవం ఉందని… గౌతం సవాంగ్ చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతగా గత ఐదేళ్లుగా ఆయన పోలీసులపై…వ్యవహరించిన తీరు.. ప్రజలందరి ముందే ఉంది. ఇప్పుడు గౌతంసవాంగ్ … తనను డీజీపీ పోస్ట్ ఇచ్చినందుకు.. ఆ గౌరవం కనిపించి ఉండవచ్చు కానీ… కాల్ మనీ కేసులో.. వైసీపీ నేతలు ఆయనపై కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటన్నింటినీ నిరూపించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది.