2014లో స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకు వస్తామని.. అవి లక్షల కోట్లలో ఉంటాయని…. నరేంద్రమోడీ బహిరంగంగా ప్రకటించారు. వాటిని తీసుకొచ్చి.. ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. పదిహేను లక్షలు వేస్తామని కూడా చెప్పుకొచ్చారు. కానీ అసలేం జరిగిది..? ఇంత వరకూ… స్విట్జర్లాండ్ నుంచి కానీ.. మరో .. దేశం నుంచి కానీ ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా వెనక్కి తీసుకు రాలేదు. కానీ.. గత ఐదేళ్లుగా.. స్విట్జర్లాండ్లో డబ్బులు దాచుకున్న వారి పేర్లంటూ.. కొన్ని తరచూ బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో.. తాజాగా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అందులో ఒకటి.. తెలుగు పేరు ఉంది. ఆ పేరే.. పొట్లూరి రాజమోహన్ రావు.
పొట్లూరి రాజమోహన్ రావుకు స్విస్ బ్యాంకుల నుంచి నోటీసులు..!
స్విట్జర్లాండ్ ప్రభుత్వం.. నల్లధనాన్ని దాచుకునేందుకు… తాము ఓ ల్యాండింగ్స్టేషన్గా మారిపోయామన్న అపప్రదను తొలగించేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా.. కాస్త ఎక్కువ డబ్బులు దాచి పెట్టి… తమ వివరాలు గోప్యంగా ఉంచుతున్న వారి గురించి.. ప్రభుత్వాలను తెలియజేయాలనుకుంది. అయితే దాన్ని పద్దతిగా చెప్పాలనుకుంటోంది. అందుకే.. ముందుగా.. ఆ ఖాతాదారులకు నోటీసులు ఇచ్చి… రహస్యాలను.. బయటకు చెప్పబోతున్నాము.. మీకేమన్నా.. అభ్యంతరమా.. అని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలోని పది మందికిపైగా నల్ల కుబేరులకు.. అలాంటి నోటీసులు వచ్చాయి. వారిలో ఒకరు పొట్లూరి రాజమోహన్ రావు.
ఎవరీ పొట్లూరి రాజమోహన్రావు..?
అచ్చ తెలుగు పేరుతో ఉన్న ఈయన డైరక్టర్గా.. పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్ వేర్, టెలికాం కంపెనీల్లో ఈయన భాగస్వామిగా ఉన్నట్లుగా…. కంపెనీల వివరాలు అందించే వెబ్ సైట్లు చెబుతున్నాయి. అయితే.. ఈయన భాగస్వాములందరూ… తెలుగువాళ్లు కాదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వారని… ఇతర డైరక్టర్లను బట్టి చూస్తే అర్థమైపోతుంది. పైగా కంపెనీల్లో అత్యధికంగా… ఏపీలో రిజిస్టర్ అయినవి కావు. అచ్చ తెలుగు వ్యక్తిలానే ఉన్నా.. ఆయన వ్యాపారాలు మాత్రం.. దేశం నలుమూలలా విస్తరించారు. అయితే.. ఈ కంపెనీల్లో ఏ ఒక్కటీ ప్రసిద్ధమైనది కాదు. ఇవి సూట్ కేసు కంపెనీలా.. లేక నిజంగానే ఉన్నాయా.. అన్నది ప్రభుత్వ వ్యవస్థలే తేల్చాలి.
ప్రభుత్వాలకు సమాచారం ఉన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నాయా..?
స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయల గురించి పూర్తి వివరాలు… ప్రభుత్వాల వద్ద ఉంటాయి. కనీసం.. స్విస్ బ్యాంక్ నోటీసుల ఇచ్చిన వారి గురించి.. ప్రభుత్వం బయట పెట్టడం.. క్షణాల్లో పని. కానీ… ఓ పది, పదిహేను మందికి.. స్విస్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ఆ పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. వాళ్లెవరు..? వాళ్లు ఏ వ్యాపారాలు చేస్తారు..? స్విస్ బ్యాంకుల్లో దాచుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. లాంటి విశేషాలు ఏమీ ఉండవు. క్షణాల్లో బయట పెట్టగలిగిన … కేంద్రం కూడా… అలానే వదిలేస్తుంది. ఇదంతా ప్రజల్ని మాయ చేయడానికి చేస్తున్న ఎత్తుగడగా మారిపోతోంది.