మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు తాజాగా వివాహ నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నారై అయిన ఒక తెలుగు కుర్రాడితో శ్రీజ వివాహాన్ని నిశ్చయించినట్లుగా సమాచారం. కొన్ని రోజుల కిందటే ఈ కార్యక్రమం చాలా నిరాడంబరంగా, అత్యంత సన్నిహితుల మధ్యనే నిర్వహించినట్లుగా తెలుస్తున్నది.
మెగాస్టార్ చిరంజీవి భుజం నొప్పికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నారని, అందువల్ల ఆయన అనంతపురం జిల్లాకు రాహుల్ గాంధీ వస్తే.. ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా ముంబాయిలో బిజీగా ఉన్నాడని కూడా కొన్ని పత్రికలు రాశాయి. అయితే భుజం ఆపరేషన్ లాంటి వార్తలు నిజం కాదని, వాస్తవానికి చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారని తాజాగా విశ్వసనీయంగా తెలుస్తున్నది.
అయితే ఈ వ్యవహారంలో కీలకమైన అంశం ఏంటంటే.. ఈ పెళ్లి సంబంధాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ కుదిర్చినట్లుగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌కు చాలా సన్నిహితుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. పార్టీలకు అతీతంగా వీరి మధ్య స్నేహం ఉంది. కామినేని చొరవ తీసుకుని ఎన్నారై అయిన కమ్మవర్గానికి చెందిన కుర్రాడిని వరుడిగా ఎంపిక చేసి సంబంధం కుదిర్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.
మెగాస్టార్ చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ.. గతంలో పెద్దలను ధిక్కరించి శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో చిరంజీవినుంచి, బాబాయి పవన్ కల్యాణ్ నుంచి తమ దంపతులకు ప్రాణగండం ఉన్నదని కూడా మీడియా ముఖంగా ప్రకటించి.. సంచలనం సృష్టించింది. పవన్ కల్యాణ్ కూడా తన రివాల్వర్‌ను పోలీసుస్టేషన్లో అప్పగించి.. అప్పట్లో బీభత్సం చేశాడు. శ్రీజ` శిరీష్ భరద్వాజ్ ఇద్దరికీ ఢల్లీిలో దాసరి నారాయణరావు అండగా నిలిచి వివాహం చేయించారు. కొన్నాళ్లు కోర్టులో కేసు కూడా నడిచింది. శిరీష్ భరద్వాజ్‌తో శ్రీజకు ఒక కుమార్తె కూడా కలిగింది. పెళ్లయిన రెండున్నరేళ్ల తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి.. విడిపోయారు. విడాకులు కూడా తీసుకున్నారు. విడిపోయిన తర్వాత ఆమె తండ్రి చిరంజీవి వద్దనే ఉంటోంది. ఇన్నాళ్లకు శ్రీజకు మళ్లీ వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారని సమాచారం. ఎన్నారై కుర్రాడితోనే త్వరలో ఈ పెళ్లి జరుగుతుంది.