సమంత హీరోయిన్ గా నందిని రెడ్డి రూపొందిస్తున్న సినిమా ఓ బేబీ. ఈ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తయారవుతోంది. ఓ వయసు మళ్లిన మహిళ యంగ్ గా కనిపించడం. లోపల మనసు మాత్రం ఓల్డ్ గా వుండడం. విదేశీ సినిమా ఆదారంగా ఈ సినిమా తయారవుతోంది.
అయితే సాధారణంగా ఇలాంటి సినిమాలో ఒకే హీరోయిన్ రెండు గెటప్ ల్లో కనిపించడం అన్నది కామన్. కానీ ఇక్కడ ఓల్డ్ గెటప్ కు లక్ష్మిని, యంగ్ గెటప్ కు సమంతను తీసుకున్నారు. ఇదే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. రెండు క్యారెక్టర్లు సమంతనే చేసి వుంటే బాగుంటుంది కదా? అన్న డిస్కషన్లు వినిపిస్తున్నాయి.
యూనిట్ ఇలా చేయడానికి బలమైన కారణం వున్నట్లు తెలిసింది. వాస్తవానికి ముందుగా సమంతనే రెండు పాత్రలు చేయాలన్నది ప్లాన్ అంట. కానీ ఓల్డ్ గెటప్ కోసం ఓ ప్రత్యేకమైన మేకప్ ను సమంతకు వేయాల్సి వుంది. అంటే పలు సినిమాల్లో కమల్ హాసన్ కు, అలాగే రోబో సినిమా కోసం అక్షయ్ కుమార్ కు వేసినట్లుగా. అయితే ఆ మేకప్ సమంతకు సూట్ కాలేదట. ఆ మేకప్ వేస్తే సమంత ఫేస్ కు రియాక్షన్ వచ్చిందని తెలిసింది. దాంతో ఆ ప్రయత్నం ఆపేసి, సీనియర్ నటి లక్ష్మిని తీసుకున్నట్లు తెలుస్తోంది.