వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం ఖరారయింది. సామాజిక సమీకరణాల లెక్కలు వేసి.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేశారు. మంత్రివర్గంలో ఒక ముస్లిం, ఏడుగురు బీసీలు, ఐదుగురు ఎస్సీలు, మంత్రివర్గంలో నలుగురు కాపులు, నలుగురు రెడ్లు, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య సామాజికవర్గానికి చెందిన వారున్నారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. స్పీకర్‌గా బీసీ వర్గానికే చెందిన తమ్మినేని సీతారాంకు చాన్సిస్తున్నారు. మంత్రివర్గంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
రెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ( డోన్ )
మేకపాటి గౌతమ్‌రెడ్డి (ఆత్మకూరు)
బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఒంగోలు)
కమ్మ
కొడాలి నాని ( గుడివాడ )
బీసీ
ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట)
పిల్లి సుభాష్‌చంద్రబోస్ (ఎమ్మెల్సీ)
మోపిదేవి వెంకటరమణ ( ఏ సభలోనూ సభ్యుడు కాదు )
పిల్లి సుభాష్ చంద్రబోస్ ( ఎమ్మెల్సీ )
పేర్ని నాని (మచిలీపట్నం)
శంకర్ నారాయణ ( పెనుకొండ )
అనిల్ కుమార్ యాదవ్ ( నెల్లూరు సిటీ )
గుమ్మనూరు జయరాం ( ఆలూరు )
కాపు
బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
అవంతి శ్రీనివాస్ (భీమిలి)
కురసాల శ్రీనివాస్(కాకినాడ రూల్)
ఆళ్ల నాని (ఏలూరు)
క్షత్రియ
చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
ఎస్సీ
పినిపే విశ్వరూప్ (అమలాపురం)
తానేటి వనిత (కొవ్వూరు)
మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
పినిపె విశ్వరూప్ ( అమలాపురం )
నారాయణస్వామి ( గంగాధర నెల్లూరు )
ఎస్టీ
పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
వైశ్య
వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ)
ముస్లిం
అంజాద్ భాషా
సామాజిక సమీకరణాల్లో భాగంగా.. జగన్మోహన్ రెడ్డి పలువురు సీనియర్లకు మొండి చేయి చూపారు. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, ఆర్కే రోజా సహా.. పలువురు సీనియర్లు కేబినెట్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ. పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు అవకాశం కల్పించారు. మోపిదేవి వెంకటరమణ… జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. నిందితునిగా ఉన్నారు.