ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తెలపై… చెరో పోలీసు కేసు నమోదయింది. ఇద్దరిపై బెదిరింపుల కేసులే నమోదయ్యాయి. ఇలా కేసులు నమోదవగానే.. అలా… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ట్వీట్ చేశారు. ఎవర్నీ వదిలి పెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి వైద్యురాలు. ఆమెపై… నర్సరావుపేట పట్టణానికి చెందిన పద్మావతి అనే ఆమె ఫిర్యాదు చేసింది. 2002లో పద్మావతి రెండు ఎకరాల పొలం కొనుగోలు చేస్తే… దానికి సంబంధించి.. ఇప్పుడు రూ. 5 లక్షలు ఇవ్వాలని.. పూనాటి విజయలక్ష్మి, మరో ఇద్దరు బెదిరించారని ఫిర్యాదు చేశారు. దానిపై.. పోలీసులు పూర్వపరాలు విచారించకుండానే కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అదే సమయంలో… నర్సరావుపేటకే చెందిన మరో బిల్డర్ .. కోడెల శివరామ్… తాను భవనాన్ని నిర్మించుకుంటే… బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేశారు.
కోడెల బాధితులంతా… నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని.. విజయసాయిరెడ్డి… ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు., అంతే కాదు.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులను ఎవరూ రక్షించలేరని వార్నింగ్ ఇచ్చారు. కోడెల కుటుంబం “కే” టాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కోడెలకు సహకరించిన అధికారులను కూడా వదలి పెట్టబోమన్నారు. ఒకే రోజు.. కోడెల కుమారుడు, కుమార్తెలపై కేసులు పెట్టడం.. వెంటనే.. విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో.. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కలకలం ప్రారంభమయింది.
స్పీకర్ కోడెలపై.. మొదటి నుంచి.. అటు వైఎస్ జగన్ కానీ.. ఇటు విజయసాయిరెడ్డి కానీ.. తీవ్రమైన వ్యతిరేకత చూపించేవారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయకపోవడం లాంటి కారణాలో.. లేక.. రాజకీయ శత్రుత్వంలో.. ఇంకో కోణం ఏదైనా ఉందో కానీ… కోడెలపై మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసేవారు. మహిళలలో ఓ సందర్భంలో కోడెల అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేయడం.. ఓ సందర్భంలో.. ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టానని కోడెల అన్నట్లుగా… ఆరోపణలు చేయడం.. వంటి వాటితో.. ఆయనపై ఓ రకంగా… గతంలోనే పోరాడారు. ఇప్పుడు అధికారం చేతికి వచ్చింది కాబట్టి.. మరో టర్న్ తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 9, 2019