అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎప్పుడు జరిగినా …పన్నెండు సీట్లే వస్తాయట. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పినమాట. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారంటే.. దానికి… ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తున్నారు. నిజంగా నిజం.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లే.. ఏపీలోనూ జరిగి తీరుతుందంటున్నారు. కేసీఆర్ మిత్రుడు .. జగన్ చెప్పిన లాజిక్లోనే… అది ఉంటుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో.. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలైంది. దానికి కారణం ఏమైనా కానీ.. యాధృచ్చికంగా.. టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. ముగ్గురు లోక్‌సభ ఎంపీలు మాత్రమే విజయం సాధించారు. టీడీపీ బ్యాడ్‌లక్ ఏమిటంటే… కచ్చితంగా… ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు…. ముగ్గురు ఎంపీలు… వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అధికారికంగా.. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఫలితాల్లో.. ఆ ఇరవై మూడు సంఖ్య మాత్రమే టీడీపీకి మిగిలింది. ఇది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చింది. అందుకే.. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని.. అందుకే.. టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయని చెప్పడం ప్రారంభించారు. దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడని.. ఎక్కడ సందర్భం వచ్చినా చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇదే చెబుతున్నారు. పొరుగు రాష్ట్రంలో.. తెలుగుదేశం పార్టీకి జరిగినట్లుగా… తెలంగాణలో టీఆర్ఎస్కు జరుగుతుందని… చెబుతున్నారు. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో ఆ పన్నెండు మందే మిగులుతారని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో… 97 లక్షల మంది టీఆర్ఎస్కు ఓటు వేస్తే.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి 77 లక్షలకు పడిపోయారని.. తిరుగుబాటుకు ఇదే సంకేతం అంటున్నారు.
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి… తెలంగాణ సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ రాజకీయాలను… ఆయన మీడియా బహిరంగంగానే సమర్థిస్తోంది. ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని.. ఉత్సాహంగా కథనాలు రాస్తున్నారు. లెక్క ప్రకారం అయితే.. రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కను… సాక్షి చెప్పాల్సింది.. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో చెబుతోంది అదే కాబట్టి…! కానీ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరి పన్నెండు సీట్లే వస్తాయా.. ఎక్కువ వస్తాయా అన్నదానిపై.. మళ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేదాకా.. ఉత్కంఠగా ఎదురు చూడాలి..!