టాలీవుడ్ లోకి కొత్త బ్యానర్లు రావడం కొత్త కాదు, నెలకు అరడజను వస్తుంటాయ్. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త బ్యానర్లకు ఓ క్రెడిబులిటీ వుంది. ఆసక్తి కలిగించే వ్యవహారం వుంది. ఆ బ్యానర్లు ఏమిటంటే..
నాగార్జునకు ఇప్పటికే అన్నపూర్ణ బ్యానర్ వుంది. అది కాకుండా మనం ఎంటర్ ప్రైజెస్ కూడా వుంది. ఈ రెండూ కాకుండా మరో మూడో బ్యానర్ ఆలోచన స్టార్ట్ అయింది. కానీ సోలోగా కాదు.
అశ్వనీదత్ కు ఇప్పటికే రెండు బ్యానర్లు వున్నాయి. ఆయన ఇప్పుడు నాగార్జునతో చేతులు కలుపుతున్నారు.
అలాగే జెమిని కిరణ్ కు ఓ స్వంత బ్యానర్ వుంది. ఆయన కూడా నాగ్, అశ్వనీదత్ తో చేతులు కలుపుతున్నారు. ఇలా నాగ్, అశ్వనీదత్, జెమిని కిరణ్ ముగ్గురు కలిసి ఓ బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ బ్యానర్ మీద వైవిధ్యమైన సినిమాలు, మీడియం, చిన్న సినిమాలు నిర్మిస్తారట.
ఇదిలా వుంటే హీరో రానా కు కూడా సురేష్ బ్యానర్ స్వంతంగా వుంది. ఆయన కూడా ఎసికె (అమర్ చిత్ర కథ) బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నారు. దీని మీద వెబ్ సిరీస్ లు, ఆనిమేటెడ్ మూవీస్, చిన్న మీడియం సినిమాలు నిర్మిస్తారట.
ఇలా పెద్ద సంస్థల నుంచి చిన్న సినిమాల కోసం కొత్త బ్యానర్లు రావడం అన్నది మంచి పరిణామమే అనుకోవాలి.