బాలయ్య-బోయపాటి సినిమాకు హీరో వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ నుంచి డేట్ లు ఇస్తానని, మిగిలన ఏర్పాట్లు చూసుకోమని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు కథ అల్లుతున్నారు. అది పూర్తయితే, సెట్ మీదకు వెళ్తుంది. అది పూర్తయ్యాక బోయపాటి సినిమా వుంటుంది.
నాలుగు నెలల్లో కేఎస్ రవికుమార్ సినిమా తీసేస్తారని బాలయ్య ధీమాగా వున్నారు. అందుకే బోయపాటికి ఈ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడతో అంతా అయిపోలేదు. బాలయ్య-బోయపాటికి 65 కోట్లు రెడీగా పట్టుకుని, ఎందుకయినా మంచిది అని మరో అయిదు కోట్లు బ్యాకప్ లో వుంచుకోగల ప్రొడ్యూసర్ కావాలి.
అదే ఎవరు అన్నది ఇంకా తేలడం లేదు. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అవన్నీ గ్యాసిప్ లే. గతంలో జయజానకీ నాయక సినిమా చేసిన నిర్మాతతో చేయాలనే ఆలోచనలో బోయపాటి వున్నట్లు తెలుస్తోంది. మరి ఓ సారి గట్టి దెబ్బతిన్న ఆ నిర్మాత మరోసారి ఏ మేరకు సిద్దమవుతారు అన్నది చూడాలి.