గ్రామవాలంటీర్ల నియామకానికి ప్రధాన అర్హత ఏమిటో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. సాంకేతికతంగా డిగ్రీ, ఇంటర్, టెన్త్ లాంటి అర్హతలు పెట్టినప్పటికీ.. ప్రధాన అర్హత వైసీపీ కార్యకర్తలు కావడమేనని.. విజయసాయిరెడ్డి నేరుగా చెప్పేశారు. వాలంటీర్ల నియామకం జరుగుతోందని…దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలుపు కోసం చాలా కష్ట పడ్డారు…ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీని నియమిస్తాం.. సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులుగ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియెట్, అర్బన్ ప్రాంతాల్లో డిగ్రీ ఉత్తీర్ణిత కలిగి ఉండాల్నారు. రూ. 5 వేల రూపాయలు తక్కువగా బావించొద్దు..ప్రసాదంలా భావించమని సూచించారు కూడా. ఎవరూ పార్టీకి చెడ్డపేరు తీసుకు రావొద్దు..అందరూ ప్రజలకి అందుబాటులో ఉండి, 2024 ఎన్నికల లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు పదిహేనో తేదీ లోపు గ్రామ వాలంటరీర్లను… ఆ తర్వాత గాంధీ జయంతి లోపు… గ్రామ సచివాలయ వాలంటీర్లను నియమించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ జన్మభూమి కమిటీల్లాంటివని.. వీటితో ప్రజాధనాన్ని ఉపయోగించి ..సొంత పార్టీ కార్యకర్తలకు.. మేలు చేస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. ఐదు వేలు తీసుకుని.. ఎవరూ… సీరియస్ గా పని చేయరని.. పథకాలు డోర్ డెలివరీ పేరుతో.. అవినీతికి పాల్పడితే..చెడ్డ పేరు వస్తుందని.. వైసీపీలోనే.. చర్చ జరుగుతోంది.
అయితే.. బూత్ లెవల్.. గ్రామ లెవల్లో.. వారే తమ పార్టీకి.. గొప్ప ఆస్తి అవుతారన్న అంచనాలో వైసీపీ వర్గాలున్నాయి. అందుకే..విజయసాయిరెడ్డి.. వైసీపీ కార్యకర్తలను పదే పదే ఈ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఎలాగూ… ఎంపిక ప్రక్రియ వైసీపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్న అర్థంలో విజయసాయిరెడ్డి చెప్పడంతో… వైసీపీ కార్యకర్తలకు హుషారు వచ్చింది.