ప్రపంచకప్‌లో.. ఫైనల్ కంటే.. ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న లీగ్ మ్యాచ్….ఇండియా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్‌ను ఓ యుద్ధం అన్నట్లుగా… అటు మీడియా.. ఇటు అభిమానులు భావించడం ప్రారంభించారు. దాంతో.. హైప్ మరింతగా పెరిగిపోయింది. ఇది యుద్ధం కాదని.. ఆట మాత్రమేనని.. అలాగే చూడాలని… భారత క్రికెటర్లు మీడియా వేదికగా.. నెత్తినోరు బాదుకున్నా.., ఆలకించేవారెవరూ.. లేరు. అందరూ యుద్ధంగానే భావిస్తున్నారు.
మ్యాచ్‌పై హైప్ పెరగడానికి భారత్ రాజకీయాలూ ప్రధాన కారణం..!
ప్రస్తుతం భారత్ – పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు అంతగొప్పగా లేవు. భారత్‌తో సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంత దిగువ స్థాయిలో ఉన్నాయని… ఇమ్రాన్ ఖాన్ కూడా.. చెప్పుకొస్తున్నారు. ఇక ఇండియా సర్కార్ అయితే.. పాకిస్థాన్ పేరును పలకడానికి కూడా ఇష్టపడటం లేదు. పుల్వామా ఉగ్రదాడికి కారణం పాకిస్తానేనని చెబుతున్న మోడీ.. ఆ దేశాన్ని ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మాటలు కూడా బంద్ చేశారు. ఎన్నికల్లో పాకిస్తాన్‌ను తన ప్రత్యర్థిగా చూపించారు. అలాంటి సమయంలో.. ఈ మ్యాచ్ జరగనుండటంతో.. సహజంగానే.. హైప్ పెరిగిపోయింది. పాకిస్తాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలన్న కసి పెరిగిపోయింది. ఫలితంగా.. అది టీమిండియా క్రికెటర్లకు మానసిక భారంగా మారిపోయింది.
టీమిండింయానే ఫేవరేట్..! కానీ ఒత్తిడే అసలు శత్రువు…!
టీమిండియా.. ఇప్పుడు అబేధ్యంగా కనిపిస్తోంది. అద్భుతమైన యువ , అనుభజ్ఞులైన ఆటగాళ్లతో సమతూకంతో ఉంది. అదే సమయంలో.. పాకిస్తాన్ జట్టు… అనిశ్చితంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఆడతారో అర్థం కాని పరిస్థితి. తొలి మ్యాచ్‌లో వంద పరుగులు చేరడానికి ఆపసోపాలు పడిన పాకిస్తాన్ ఆ తర్వాత సునాయాసంగా మూడు వందల పరుగులకు చేరింది. అలాంటి.. అనిశ్చితి … పాకిస్తాన్ ఆటగాళ్లలో ఉంది. అయితే.. భారత్ జట్టు ఆటగాళ్లు ఎంత ప్రతిభావంతలైనప్పటికీ.. వారిపై ఒక్కొక్కరిపై.. వంద కేజీల బరువు పెట్టుకుని ఆడుతున్నట్లుగా ఆడాలి. దానికి కారణం.. పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. యుద్ధం అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం. కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని వస్తున్న ఒత్తిడి. దీన్ని అధిగమిస్తే.. టీమిండియాకు ఎదురు ఉండదు.
ఆటను ఆటలా.. చూడలేమా..?
ఆటల్లోనూ రాజకీయాలు చొచ్చుకు వచ్చేశాయి. క్రీడాస్ఫూర్తితో.. ఓ దేశం.. మరో దేశంతో.. ఆటలు ఆడుతాయి. గెలుపోటములు ఎవరికైనా రావొచ్చు. అంత మాత్రాన.. ఆ దేశంపై పైచేయి సాధించేశామన్న భావనకు రావడం.. అసంబద్ధం. కానీ.. ఆటలపై.. రాజకీయాల ప్రభావం ప్రారంభమైన తర్వాత అవి యుద్ధాల్లా మారిపోయాయి. ఇతర దేశాలతో పోటీ పడినప్పుడు… క్రికెట్ మ్యాచ్‌ల గురించి పట్టించుకోని వారు.. పాకిస్తాన్‌తో మ్యాచ్ అనేసరికి.. టీవీల ముందు కూర్చుంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ టీంను శత్రువుగా ఊహించుకుని ఓడగొడితే తమ మనసు ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నారు. సొంత ప్రజల్ని చీల్చి.. మెజార్టీ, మైనార్టీ రాజకీయాలు చేస్తున్న రాజకీయ పార్టీలు.. దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.
బెస్టాఫ్ లక్ టీమిండియా..!
తామేతో పాకిస్తాన్ పై యుద్ధానికి వెళ్తున్నట్లుగా.. ఆ మ్యాచ్‌లో వారిని ఓడించకపోతే… తామంతా వేస్ట్ అన్నట్లుగా….జరుగుతున్న ప్రచారం … టీమిండియా ఆటగాళ్లకు గుదిబండలాంటిదే. అయితే్.. అవన్నీ.. మైదానంలోకి దిగే వరకూ గుర్తుంచుకుని.. ఆ తర్వాత.. ఆటపైనే దృష్టి పెట్టడం… ఆటగాళ్ల లక్షణం. దీన్ని తూ.చ తప్పకుండా అమలు చేస్తే ఆటగాళ్లలో కూడా.. యుద్ధం అనే భావన తొలగిపోయి.. క్రికెట్ అనే భావన వస్తుంది.అప్పుడు టీమిండియాకు ఎదురు ఉండదు. …. అలా జరగుతుందని ఆశిద్దాం..!
బెస్టాఫ్ లక్ టీమిండియా..!