తెలుగుదేశం పార్టీ అధికారపక్షంలో ఉన్నప్పుడు… వైసీపీ… ప్రతీ అంశంపైనా సీబీఐ విచారణ కోరేది. చివరికి.. జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైతే.. ఆ ఘటన దగ్గర్నుంచి.. అమరావతి భూముల వరకూ.. దేన్నీ వదిలి పెట్టలేదు. అన్నింటిపైనా విచారణ కోరింది. వీటిలో… రెండు అత్యంత కీలకమైన కేసులు ఉన్నాయి. ఒకటి.. జగన్ బాబాయ్.. వివేకానందరెడ్డి హత్య కేసు. రెండు… జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఘటన కేసు. ఈ రెండు కేసుల్లో విచారణను సీబీఐకి ఇవ్వాలంటూ.. వైసీపీ కోర్టుల్లో పిటిషన్లు కూడా వేసింది. ఇప్పుడు.. సిఫార్సు చేసే అధికారం … వైసీపీ చేతికే వచ్చింది. మరి ఏం చేయబోతోంది..?
నిర్ణయాధికారం వచ్చిన తర్వాత కోడికత్తి కేసుపై ఎందుకు వెనుకడుగు..?
అక్టోబర్ 25, 2018న జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది. మధ్యాహ్నం సమయంలో.. ఒక్కసారిగా కలకలం. జగన్పై శ్రీనివాస్ అనే యువకుడు సెల్ఫీ కోసం వచ్చి .. కోడి కత్తితో దాడి చేశాడు. జగన్కు గాయం అయింది. విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స చేయించుకుని.. జగన్… హైదరాబాద్ వెళ్లి పెద్ద ఆస్పత్రిలో చేరారు.ఈ ఘటన.. కచ్చితంగా… జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నమేనని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. చంద్రబాబు హస్తం ఉందని స్పష్టం చేసింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆదినారాయణపై కూడా ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి.. సీబీఐకి ఇవ్వాల్సిందేనని కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు నిర్ణయాధికారం.. వైసీపీ చేతికే వచ్చింది. కానీ.. సీబీఐ విచారణ ఆలోచనే చేయడం లేదు.
వైఎస్ వివేకా హత్య సీబీఐకి ఇవ్వడానికి ఎందుకాలస్యం..!?
వైఎస్ వివేకానందరెడ్డి … ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గరయ్యారు. నరికి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నా.. గుండెపోటుతో చనిపోయినట్లుగా.. అందర్నీ నమ్మించే ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పి.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి.. సీబీఐ విచారణ కావాలన్నారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. వైఎస్ వివేకా కుమార్తెతో కూడా పిటిషన్ వేయించారు. తీరా.. తాము సిఫార్సు చేస్తే.. సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉన్నా… జగన్ లైట్ తీసుకుంటున్నారు. అప్పట్లో.. ఊరూవాడా తిరిగిన వైఎస్ వివేకా కుమార్తె .. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకిలా జరుగుతోంది..?
సీబీఐకి అనుమతి ఇచ్చారు కదా..! సిఫార్సు చేస్తారా..?
సీబీఐకి నేరుగా రాష్ట్రంలోకి వచ్చి దర్యాప్తు చేసే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కేసులను మాత్రం టేకప్ చేస్తుంది. అలా.. ఏపీ సర్కార్.. కోడి కత్తి కేసు, వైఎస్ వివేకా కేసు.. సిఫార్సు చేస్తే… కచ్చితంగా సీబీఐ విచారణ చేస్తుంది. హత్యాయత్నం.. హత్యలకు కారణం ఎవరో నిగ్గు తేలుస్తుంది. ీ రెండు హై ప్రోఫైల్ కేసులు కాబట్టి.. స్థానిక పోలీసులపై ఒత్తిడి ఉంటుంది. సీబీఐపై ఉండదు బాధిత కుటుంబం అయిన.. వైఎస్ ఫ్యామిలీకి న్యాయం జరుగుతుంది. అయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనుకాడుతున్నారన్నదే.. ఆసక్తికరం…!