తెలంగాణ సీఎం కేసీఆర్.. విజయవాడకు వెచ్చి మరీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాలని.. ఏపీ సీఎంను ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. తెలంగాణ సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ కాబట్టి.. ఎగువ రాష్ట్రం, దిగువ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకూడదని.. మహారాష్ట్రతో పాటు ఏపీ ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు. అట్టహాసంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కేసీఆర్ ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి మన్నించిందీ.. లేనిది.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం.. తెలంగాణ సీఎంతో ఉన్న వ్యక్తిగత సంబంధాలను.. బట్టి చూస్తే.. ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించినందుకు.. జగన్మోహన్ రెడ్డి.. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. అయితే… ఈ కార్యక్రమంపై.. ఇంత వరకూ అటు ప్రభుత్వం కానీ.. ఇటు వైసీపీ కాని.. అధికారికంగా.. స్పందించలేదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు జగన్‌ను.. కేసీఆర్ ఆహ్వానిస్తున్నారని తెలియగానే.. ముందుగా రియాక్షన్ వచ్చింది.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆ పార్టీ నేతలు.. జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే.. వైఎస్ ఆత్మను క్షోభ పెట్టినట్లేనని..చెప్పారు. దానికి వారు చెప్పిన కారణాలు చాలా ఉన్నాయి. వైఎస్ తలపెట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ ను రీ డిజైన్ చేసి .. కాళేశ్వరం అంటున్నారని.. 20వేల కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్ట్‌ను లక్ష కోట్లతో కడుతూ… భారీ అవినీతికి పాల్పడ్డారని.. టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రాజెక్టుల్లో .. కాంట్రాక్టుల్లో అవినీతి లేకుండా చేస్తానంటున్న…జగన్.. కాళేశ్వరం ఓపెనింగ్ కు వస్తే.. అవినీతిని సమర్థించినట్లేనని.. భట్టివిక్రమార్క లాంటి నేతలు నేరుగానే అంటున్నారు.
మరో వైపు.. తెలుగుదేశం పార్టీ నేతలు… గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆహ్వానాన్ని జగన్మోహన్ రెడ్డి అంగీకరించారో.. లేదో స్పష్టత లేకపోవడంతో.. టీడీపీ నేతలెవరూ…ఇప్పటిదాకా బహిరంగంగా స్పందన తెలియచేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం… కాళేశ్వరంపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో.. కర్నూలులో జలదీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి… కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే.. ఏపీకి చుక్కనీరు రాదని.. ఆందోళన వ్యక్తం చేశారు. నీటి యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి జగన్ విధానాన్ని… టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై గత ఏపీ ప్రభుత్వం అధికారికంగా .. పలు ఫిర్యాదులను కేంద్రం వద్ద చేసింది. అపెక్స్ కౌన్సిల్ భేటీకి పట్టుబడుతోంది. ఇలాంటి సమయంలో… ఏపీ సీఎం ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్తే… ఆ ఫిర్యాదుల్లో పస లేకుండా పోతుందని… ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లవుతుందన్న చర్చ కూడా.. రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.