భారతీయ జనతా పార్టీలో అమిత్ షా తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. పార్టీలో సీనియర్ల కన్నా.. తాను ఎంతో మిన్న అని… వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా నియామకంతో.. తేల్చేశారు. సోమవారం రాత్రి హఠాత్తుగా.. భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. జేపీ నడ్డాను నియమించి.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించింది. అధ్యక్షుడిగా హోంమంత్రి అమిత్ షా కొనసాగుతారు. ఆరు నెలల పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడ్డా ఉంటారని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీకి అన్నీ అమిత్ షానే..!
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పదవీ కాలం ఎప్పుడో ముగిసింది. బీజేపీ సిద్ధాంతాల ప్రకారం.. ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవిని చేపట్టగలరు. అదే సమయంలో… జోడు పదవులు కూడా ఉండవు. అయితే పార్టీ పదవి లేకపోతే ప్రభుత్వ పదవి ఉంటుంది. కేంద్రమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టడంతో… మరో సీనియర్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అయితే.. కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. ఈ ఏడాది చివరి వరకూ.. అమిత్ షానే అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఎన్నికల వ్యూహాల వరకూ అమిత్ షా చూసుకుని… దైనందిన కార్యక్రమాలను నడ్డా పర్యవేక్షించేలా… వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సీనియర్లను మించిపోయి పార్టీపై పట్టు సాధించిన షా..!
నిజానికి.. బీజేపీలో .. అమిత్ షా, రాజ్ నాథ్ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లు మోదీ, అమిత్ షాలు.. గుజరాత్‌లో… రాష్ట్ర స్థాయి నేతలుగా ఉన్నప్పుడే.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. వారు అధ్యక్షులయినప్పుడు కూడా.. పార్టీపై ఇంత పట్టు సాధించలేకపోయారు. చివరికి అత్యంత పవర్ ఫుల్ అనుకున్న రాజ్‌నాథ్ సింగ్ కూడా.. 2014లో కేంద్రమంత్రి అవగానే బీజేపీ అధ్యక్ష పదవిని వదులు కోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌లోకి అమిత్ షాను ఎంపిక చేశారు. 2019లో అమిత్ షా.. రాజ్‌నాథ్ ప్లేస్‌లో.. కేంద్రహోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా… అప్పుడు రాజ్ నాథ్ చేసినట్లుగా.. ఇప్పుడు… బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం లేదు. కొనసాగేందుకు.. పార్టీపై తాను సాధించిన పట్టును ఉపయోగించుకుంటున్నారు.
అమిత్ షా చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వం, పార్టీ ..!
అటు ప్రభుత్వంలో.. ఇటు పార్టీలో… అమిత్ షా… అత్యంత బలమైన వ్యక్తిగా మారారు. ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉంటూ.. నెంబర్ టూ పొజిషన్‌కు వెళ్లారు. దాదాపుగా అన్ని మంత్రి వర్గ ఉపసంఘ కమిటీల్లోనూ ఉన్నారు. ప్రతీ శాఖలోనూ ఆయనకు అధికారాలు ఉన్నాయి. అలాగే.. పార్టీ అధ్యక్ష పదవికి ఆయనే ఉండాలంటూ… ప్రచారం చేయించుకోగలిగారు. చివరికి ఆయనే కొనసాగుతున్నారు. అంటే.. అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ఆయన సుప్రీంలీడర్‌గా మారుతున్నారు. ఇది.. బీజేపీ సీనియర్లకు మింగుడు పడకపోయినా.. చేయగలిగేదేమి లేని.. పరిస్థితి.