ఈమధ్య టాలీవుడ్ టైమ్ ఏమీ బాలేదు. గాయాల పాలవుతున్న కథానాయకుల లిస్టు పెరుగుతోంది. రోజుకో ‘చేదు’ వార్త వినాల్సివస్తోంది. యువ కథానాయకులు కొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇంకొందరు షూటింగులకు దూరమయ్యారు. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. కథానాయిక అనుష్కకీ గాయమైందని. ఆమె కాలికి ప్రాశ్చర్ అయ్యిందని, ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల `సైరా` సెట్లో పాల్లొంది అనుష్క. ఆ సమయంలో నడవలేక ఇబ్బంది పడిందని సమాచారం. ‘సైరా’ షూటింగ్ ముగిసిన వెంటనే అనుష్క సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిందని తెలుస్తోంది. ప్రస్తుతం `సైలెంట్` సినిమాతో బిజీగా ఉంది స్వీటీ. ఈ షూటింగ్‌కి అనుష్క తరచూ డుమ్మా కొడుతోందట. దానికి కారణం.. కాలికి అయిన గాయమే అని చెబున్నారు. ఇటీవల అనుష్క మరీ లావైపోయింది. ‘బాహుబలి 2’లో బొద్దుగా ఉన్న అనుష్కనే చూడాల్సివచ్చింది. అయితే ఆ తరవాత.. బాగా సన్నబడింది. ఇప్పుడు తాజాగా కాలికి గాయమవ్వడంతో.. అనుష్క మళ్లీ బరువు పెరగడం మొదలెట్టిందని చెబుతున్నారు. కాలి గాయం చిన్నదే కాబట్టి ఆ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అనుష్క జాగ్రత్తపడుతుందని సమాచారం.