ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హామీల అమలులో ఎక్కడ లేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. అమలు చేస్తే.. ఓ తంటా.. అమలు చేయకపోతే మరో తంటా.. అన్నట్లుగా.. ఓ పథకం విషయంలో చిక్కులు ప్రారంభణయ్యాయి. ఆ పథకమే… “అమ్మఒడి”. బడికి పిల్లల్ని పంపే ప్రతి తల్లికి రూ. పదిహేను వేలు ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్యాసంబంధితమైన ప్రతీ కార్యక్రమంలోనూ ఈ ప్రకటన చేస్తున్నారు. కానీ ఇప్పుడు.. దాన్ని అమలు చేయాలంటే.. కొన్ని సంక్లిష్టమైన సమస్యలు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకే ఇస్తామంటున్న ఆర్థికమంత్రి..!
“అమ్మఒడి” పథకంపై ఆర్థిక మంత్రి..బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మెల్లగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి మాత్రమే ఇస్తామని… బుధవారం.. కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. దీని వల్ల .. ఆ పథకంపై.. భారం.. ఆర్థిక 90 శాతం తగ్గిపోతుంది. ఇప్పుడు.. ప్రభుత్వ స్కూళ్లలో… చేర్పించేవారు తగ్గిపోయారు. ఇటీవలి కాలంలో.. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా.. ఒక్కటంటే.. ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ హేతుబద్దీకరణ పేరుతో.. కొన్ని వందల స్కూళ్లను తొలగించారు. విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పడిపోతోంది. ఏపీలో చదువుకుంటున్న విద్యార్థుల్లో దాదాపుగా 90 శాతం మంది విద్యార్థులు.. ప్రైవేటు స్కూళ్లలోనే చదవుకుంటున్నారు. వారిని పథకం నుంచి మినహాయిస్తే… ప్రభుత్వం ఆర్థిక గండం నుంచి బయటపడొచ్చు.
మరి జగన్ మాట తప్పినట్లు అవుతుంది కదా..!?
ప్రభుత్వ స్కూళ్లకే “అమ్మఒడి” పథకాన్ని పరిమితం చేస్తూ… నిర్ణయం తీసుకుంటే… “మాట తప్పం.. మడమ తిప్పం “… అనే జగన్మోహన్ రెడ్డి కి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే.. ఎన్నికల ప్రచారంలోనే కాదు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా… ఆయన… ఎక్కడ చదివించినా పర్వాలేదు… ప్రతి తల్లికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. మొన్నటికి మొన్న.. రాజన్నబడిబాట కార్యక్రమంలోనూ ప్రతీ తల్లికి అదే భరోసా ఇచ్చారు. ఇప్పుడు.. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికే ఇస్తానంటే… అది ఆయనకు వాగ్ధానభంగం అవుతుంది. అదే జరిగితే… చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చి.. హామీలు అమలు చేయకపోతే.. రాజీనామా చేసి ఇంటికి పోవాలనే పద్దతి తీసుకు రావాలన్న పట్టుదలతో ఉన్న జగన్‌కు… చిక్కులు వస్తాయి.
అందరికీ ఇస్తే ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం..!
ఇచ్చిన మాటకు కట్టుబడి… అందరికీ… “అమ్మఒడి”పథకాన్ని వర్తింప చేస్తే… మరో రకమైన సమస్యలు వస్తాయి. ప్రైవేటు స్కూళ్లన్ని ఆ పథకాన్ని తమ బ్రాండ్‌గా మార్చుకుని పిల్లల్ని చేర్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇక ముందు అదో పెద్ద ప్రహసనంగా మారిపోతుంది. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీలు.. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం… విద్యార్థుల్ని చేర్చుకునేందుకు ఎలాంటి వేషాలు వేస్తున్నాయో.. అందరూ చూస్తున్నారు. ఇప్పుడా రోగం.. ప్రైవేటు స్కూళ్లకు అంటుకుంటుంది., దీని వల్ల.. ప్రభుత్వ స్కూళ్లలో చేరేవారు ఇంకా ఇంకా తగ్గిపోతారు. ఫలితంగా… పేదలు మరింతగా విద్యకు దూరమవుతారు.
ఏం చేసినా విపక్షాలు విమర్శలు తప్పించుకోలేరు..!
“అమ్మఒడి” పథకం విషయంలో.. అటు అందరికీ ఇవ్వాలన్నా.. ఇటు ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం అయినా.. తమ తమ వెర్షన్లతో విపక్ష పార్టీలు రెడీగా ఉన్నాయి. ఏం చేసినా విమర్శలు తప్పదు. అదే సమయంలో ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. అందుకే.. జగన్మోహన్ రెడ్డి.. ఈ పథకం.. చికాకులు తెప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది.